Movie News

ఆర్టీసీ బస్సులో తండేల్ పైరసీ… బన్నీ వాసు రియాక్షన్!

పైరసీ రోజు రోజుకూ ఎంత ప్రమాదకరంగా మారుతోందో ఇటీవలి పరిణామాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. రిలీజ్ రోజే మంచి క్వాలిటీతో హెచ్‌డీ ప్రింట్లు బయటికి వస్తుండడంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. సంక్రాంతి సినిమా ‘గేమ్ చేంజర్’కు పైరసీ వల్ల గట్టి దెబ్బే పడింది. తాజాగా ‘తండేల్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన విషయంలో చాలా సంతోషంగా ఉన్న చిత్ర బృందానికి పైరసీ భూతం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది.

ఈ సినిమాకు సంబంధించి కూడా క్వాలిటీ పైరసీ ప్రింట్ తొలి రోజే ఆన్ లైన్లోకి వచ్చేసింది. దారుణమైన విషయం ఏంటంటే.. ఏపీలో ఒక చోట ఆర్టీసీ బస్సులో ‘తండేల్’ పైరసీ వెర్షన్‌ను ప్రదర్శించారు. ఈ విషయం ‘తండేల్’ నిర్మాతల దృష్టికి కూడా వచ్చింది. ఒక న్యూస్ పోర్టల్‌లో దీనికి సంబంధించిన న్యూస్‌ చూసిన నిర్మాత బన్నీ వాసు.. ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకల్ల నారాయణరావుకు ఫిర్యాదు చేశారు.

సర్వీస్ సనంబర్ 3066 బస్సులో తండేల్ పైరసీ వెర్షన్‌ను ప్రదర్శించినట్లు తమ దృష్టికి వచ్చిందని.. ఇది దారుణమని.. దీనికి సంబంధించి కఠిన చర్యలు చేపట్టాలని ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్‌కు బన్నీ వాసు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో పైరసీ వెర్షన్లు ప్రదర్శించడం కొత్తేమీ కాదు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో బస్సు సిబ్బంది యథేచ్ఛగా పైరసీ వెర్షన్లను వేసేస్తున్నారు.

మరీ రిలీజై రెండు మూడు రోజులు కాకముందే ఇలా ఆర్టీసీ బస్సులో పైరసీ వెర్షన్ వేయడం అన్నది దారుణం. ఈ పరిణామంతో మొత్తంగా ఆర్టీసీలో కదలిక వస్తుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. విజయవాడలో జరిగిన సక్సెస్ టూర్‌లో భాగంగా పైరసీ చేసిన వాళ్లకు, చూసే వాళ్లకు బన్నీ వాసు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. కొందరు పైరసీలో సినిమా చూద్దామని వెయిట్ చేస్తున్నారని.. వాళ్లు ఆ ప్రయత్నాలు మానుకోవాలని వాసు అన్నాడు.

ఇంతకుముందు ‘గీత గోవిందం’ సినిమాను పైరసీ చేసిన వాళ్లు ఇప్పటికీ కేసులతో ఇబ్బంది పడుతున్నారని.. ‘తండేల్’ మూవీని పైరసీ చేసిన వాళ్లు, డౌన్ లోడ్ చేసిన చూసిన వాళ్లు ఎవ్వరినీ తాను వదిలిపెట్టనని.. ప్రస్తుతం రిలీజ్, ప్రమోషన్ల హడావుడిలో ఉన్నామని.. ఇలా చేసిన ప్రతి ఒక్కరి మీదా కేసులు పెడతామని వాసు హెచ్చరించాడు.

This post was last modified on February 10, 2025 3:51 pm

Share

Recent Posts

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

10 minutes ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

38 minutes ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

48 minutes ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

3 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

4 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

4 hours ago