తెలుగులో రాజమౌళి లాగే బాలీవుడ్లో ఇప్పటిదాకా అపజయమే ఎరుగని ఒక దర్శకుడున్నాడు. ఐతే ఆయనేమీ రాజమౌళిలా మాస్ మసాలా సినిమాలతో మొదలుపెట్టి ఈవెంట్ చిత్రాలకు మళ్లిన దర్శకుడు కాదు. సందేశం, వినోదం మిళితమైన కథలను అద్భుతంగా తెరపై ప్రెజెంట్ చేస్తూ.. చాలా తక్కువ సినిమాలతోనే ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే గ్రేటెస్ట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న ఆ వ్యక్తే రాజ్ కుమార్ హిరాని.
ఇండియన్ సినిమాలో ఉన్న ప్రతి నటుడూ, టెక్నీషియన్ ఒక్కసారైనా కలిసి పని చేయాలని ఆశించే దర్శకుల్లో హిరాని ఒకడనడంలో సందేహం లేదు. ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ మొదలుకుని.. ‘డంకీ’ వరకు హిరాని తీసిన ప్రతి చిత్రం విజయవంతమైంది. ఇప్పుడాయన ‘మున్నాభాయ్’ సిరీస్‌లో మూడో సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించబోతున్నాడన్న వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ ఎంటర్టైనింగ్ ఫ్రాంజైజీ సినిమాల్లో ‘మున్నాభాయ్’ ఒకటి. సంజయ్ దత్ కెరీర్‌ను గొప్ప మలుపు తిప్పుతూ రాజ్ కుమార్ హిరాని రూపొందించిన ‘మున్నాభాయ్’ అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయింది. దీన్నే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ చేస్తే అది కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత హిరాని ‘లగేరహో మున్నాభాయ్’ తీస్తే అది కూడా ఘనవిజయం సాధించింది.
ఈ రెండు చిత్రాలకు కొనసాగింపుగా ‘మున్నాభాయ్-3’ తీయాలని హిరాని-సంజు ఎప్పుడో అనుకున్నారు. కానీ ఇన్నేళ్లు అది పట్టాలెక్కబోతోంది. మూడోసారి మున్నాభాయ్‌గా సంజయ్ దత్ అలరించడానికి రెడీ అయ్యారు. ఈ చిత్రంలో కీలక పాత్రకు నాగార్జునను అడిగారని, ఆయన కూడా ఓకే చెప్పారని సమాచారం. నాగ్ ఈ మధ్య వరుసగా ప్రత్యేక పాత్రలు చేస్తున్నారు.
‘కుబేర’లో ధనుష్‌తో, ‘కూలీ’లో రజినీకాంత్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ‘మున్నాభాయ్-3’లో సంజుతో జట్టు కట్టబోతున్నారట. పాత్ర ఎలాంటిదైనా హిరాని లాంటి గొప్ప దర్శకుడి సినిమాలో నాగ్ నటిస్తున్నాడంటే అభిమానుల ఆనందానికి కొదవేముంది? ఈ వార్త నిజమైతే టాలీవుడ్‌కు అది హ్యాపీ న్యూసే.
This post was last modified on February 10, 2025 3:32 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…