కొత్త సినిమాల రిలీజ్ దగ్గర పడే సమయానికి డిస్ట్రిబ్యూటర్లు మారడం.. కొన్ని ఏరియాల్లో ఒకరి నుంచి ఇంకొకరికి సినిమా చేతులు మారడం మామూలే. అనుకున్న ప్రకారం డీల్స్ జరగనపుడు కొన్నిసార్లు నిర్మాతలు వెనక్కి తగ్గుతుంటారు. కొన్నిసార్లు బయ్యర్లు వెనుకంజ వేస్తుంటారు. కానీ ఓటీటీ డీల్స్ విషయంలో ఇప్పటిదాకా ఇలాంటి మార్పులు జరిగినట్లు వార్తలేమీ రాలేదు.
ఇప్పుడు ఓ కొత్త సినిమా ఒక టాప్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ చేతి నుంచి మరో సంస్థ చేతికి వెళ్లిపోయింది. ఈ అనూహ్య పరిణామం కోలీవుడ్లో చోటు చేసుకుంది. జయం రవి హీరోగా తెరకెక్కిన ‘భూమి’ సినిమా.. హాట్ స్టార్ వాళ్ల చేతి నుంచి సన్ గ్రూప్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ చిత్ర నిర్మాత ముందు హాట్ స్టార్ వాళ్లకే డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు అమ్మాడు. కానీ ముందు అనుకున్న ప్రకారం హాట్ స్టార్ డబ్బులు చెల్లించకుండా.. బేరానికి దిగడంతో ఆ ఒప్పందాన్ని నిర్మాత రద్దు చేసుకున్నాడు.
ఈ సినిమాను సన్ గ్రూప్ భారీ మొత్తానికి దక్కించుకుంది. ఐతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. డిజిటల్ ప్రిమియర్ కంటే ముందు టీవీల్లో ఈ సినిమా ప్రసారం కాబోతోంది. దీపావళి రోజు సన్ టీవీలో ఈ చిత్రాన్ని ప్రిమియర్‌గా వేయనున్నారు. తర్వాతి రోజు నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీ ఫ్లాట్ ఫాంలో సినిమా అందుబాటులోకి వస్తుంది. థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఎంటర్టైన్మెంట్ ఛానెల్లో విడుదలవుతున్న తొలి పేరున్న సినిమా ఇదే కావడం విశేషం.
‘భూమి’ రైతుల సమస్యల నేపథ్యంలో సాగే సినిమా. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న నిధి అగర్వాల్.. తొలిసారిగా తమిళంలో నటించిన చిత్రమిది. ఇంతకుముందు జయం రవితోనే ‘బోగన్’ సినిమా తీసిన లక్ష్మణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ‘బోగన్’ చిత్రాన్ని తెలుగులో రవితేజతో రీమేక్ చేసేందుకు ఒప్పందం కుదిరి కొన్ని నెలల పాటు ఇక్కడే ఉన్న లక్ష్మణ్.. చివరికి రవితేజ హ్యాండివ్వడంతో తిరిగి కోలీవుడ్‌కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత తీసిన చిత్రమే భూమి.
This post was last modified on October 21, 2020 10:30 am
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్‌పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…
బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ…