కొత్త సినిమాలకు హిట్ టాక్ వస్తే నిర్మాతలు ఆనందిస్తుండగానే గంటల వ్యవధిలో పైరసీ బారిన పడిందనే వార్త వాళ్ళను ఆందోళనకు గురి చేస్తోంది. ఎప్పుడూ లేనిది ఈ భూతం తాజాగా హెచ్డి రూపం సంతరించుకోవడం పరిశ్రమకు ప్రమాద ఘంటికలు మ్రోగిస్తోంది. నూతన సంవత్సరంలో గేమ్ ఛేంజర్ నుంచి తండేల్ దాకా పైరసీ బారిన పడిన సంఖ్య అప్పుడే నాలుగైదుకు చేరుకుంది.
దీన్ని బన్నీ వాస్ సీరియస్ గా తీసుకున్నారు. పైరసి చేసినవాళ్ళను వదలమని, గీతా గోవిందం కేసులో ఉన్న వాళ్ళు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నారని, గీతా ఆర్ట్స్ సినిమాలను చౌర్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ఇక్కడి దాకా బాగానే ఉంది కానీ డౌన్లోడ్ చేసుకుని చూసినవాళ్లను సైతం వదలనని చెప్పడం మరో ట్విస్టు. నిజానికి పైరసీ మూలలను వెతికి పట్టుకోవడమే ఇండస్ట్రీకి పెద్ద సవాల్ గా మారింది. బోలెడు వెబ్ సైట్స్ తో పాటు తాజాగా వాట్సాప్, టెలిగ్రామ్ ఇలా రకరకాల యాప్స్ రూపంలో లింకులు షేర్ చేసుకుంటున్న వాళ్ళ సంఖ్య కోట్లలో ఉంటోంది.
వీళ్లందరినీ ట్రేస్ చేయడం అంత సులభం కాదు. అసలు చేస్తున్నవి ఎవరు, ఏ దేశంలో, ఎక్కడి నుంచి చేస్తున్నారో పసిగట్టి అరికడితే డౌన్లోడ్ చేసుకునవాళ్లు ఉండరుగా. దశాబ్దాలుగా పీడిస్తున్న ఈ సమస్య ఇప్పటికప్పుడు కాకపోయినా వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలి.
ఆ మధ్య ఈటివి తమ యాప్ కంటెంట్ ని పైరసీ చేయలేని విధంగా కొన్ని చర్యలు తీసుకుంది. ఫలితం వచ్చింది కూడా. కానీ కథ మళ్ళీ మొదటికే రావడం వేరే విషయం. ఇలాంటి కట్టడి చర్యలు నిరంతరం కొనసాగుతూనే ఉండాలి. తండేల్ ఒక్కటే కాదు భవిష్యత్తులో ఎన్నో సినిమాలు పైరసీ బారిన పడకుండా చూసుకోవాలంటే ఒకరిద్దరితో జరిగే పని కాదు.
కలిసికట్టుగా పోరాటం చేయాలి. లేకపోతే జరగబోయే నష్టం పదులు కాదు వందల కోట్లలో ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూసేవాళ్లనేమో కానీ ముందు చేసేవాళ్లను పట్టుకుంటే బన్నీ వాస్ కు మద్దతుగా నిలబడేందుకు టాలీవుడ్డే కాదు అన్ని పరిశ్రమలు మద్దతిస్తాయి.
This post was last modified on February 10, 2025 2:14 pm
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా..…