Movie News

గ్రామీ విజేత నోట… దేవర చుట్టమల్లే పాట

ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు గెలిచాక ప్రపంచమంతా టాలీవుడ్ వైపు దృష్టి పెడుతోంది. ఇది కేవలం రాజమౌళికి మాత్రమే పరిమితం కావడం లేదు. వివిధ తెలుగు సినిమాల మీద పరిశీలనలు జరుగుతున్నాయి. ఇటీవలే పుష్ప 2 క్లైమాక్స్ వీడియో క్లిప్ ఒక ప్రముఖ ఇంగ్లీష్ హ్యాండిల్ ట్విట్టర్ లో షేర్ చేస్తే దానికి ఒక్క రోజులోనే పాతిక మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

భగవంత్ కేసరిలో మ్యాన్ హోల్ క్యాప్ అడ్డం పెట్టుకుని తుపాకీ గుళ్ల వర్షాన్ని బాలయ్య అడ్డుకునే ఫైట్ చాలా వైరలయ్యింది. ఇవే కాదు బాహుబలి, మగధీర, సాహు, హనుమాన్ లాంటివెన్నో ఇంగ్లీష్ జనాలకు రీచవుతున్నాయి.

దేవర కూడా ఈ జాబితాలో చేరిపోయింది. నాలుగుసార్లు గ్రామీ పురస్కారం దక్కించుకున్న విజేత ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షీరాన్. ఇతను ప్రముఖ బ్రిటిష్ గాయకుడు. ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్నాడు. బెంగళూరులో జరిగిన ఈవెంట్ లో దేవరలోని చుట్టమల్లే పాటను పాడి ఆహుతులను ఆశ్చర్యానికి గురి చేశాడు.

నిజానికిది ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే చెన్నైలో జరిగిన కన్సర్ట్ లో ఊర్వశి ఊర్వశి పాడినప్పుడు అది దశాబ్దాల తరబడి ఊపేసిన రెహమాన్ కంపోజింగ్ కాబట్టి ఎంజాయ్ చేశారు. అందులోనూ ఫాస్ట్ బీట్. కానీ చుట్టమల్లే అలా కాదు. రొమాంటిక్ స్లో మెలోడీ. తెలుగు వస్తే తప్ప ఆస్వాదించలేం.

అయినా షీరాన్ నోటి వెంట దేవర పాట వినడం తారక్ అభిమానులను సంతోషంలో ముంచెత్తుతోంది. దీన్ని జూనియర్ ఎన్టీఆర్ తన ఇన్స్ టా స్టోరీ లో షేర్ చేసుకున్నాడు కూడా. ఈ పరిణామాలు చూస్తుంటే తెలుగు సినిమా అంతర్జాతీయ సరిహద్దులు దాటినట్టేనని చెప్పాలి.

ఎందుకంటే తలలు పండిన కంపోజర్లకు ఇప్పటికీ కలగా మిగిలిన గ్రామీని అన్ని పర్యాయాలు అందుకున్న షీరన్ గుర్తు పెట్టుకుని గాయకి శిల్ప రాయ్ తో దేవర గానం చేయడం చిన్న విషయం కాదు. రాబోయే రోజుల్లో మన ప్యాన్ ఇండియా మూవీస్, వాటిలో సంగీతం, పాటల మీద ఇంటర్నేషనల్ సింగర్స్ సైతం దృష్టి పెడతారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదు.

This post was last modified on February 10, 2025 11:02 am

Share

Recent Posts

ఫ్యాన్ బుగ్గ గిల్లుడు… షాక్ అయిన హీరోయిన్

ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…

37 minutes ago

‘ఏకం’తో లోకల్ వార్ లోకి కేకే సర్వే కిరణ్!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…

1 hour ago

సరిహద్దులు దాటిన పీఓకే బాలిక.. తిరిగి వెళుతుందా?

భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…

2 hours ago

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

3 hours ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

3 hours ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

4 hours ago