తమిళ్ రాకర్స్.. ఈ పేరు చెబితే కోలీవుడ్ వణికిపోతుంది. ఆ వెబ్ సైట్ తమిళ సినీ పరిశ్రమకు చేసిన నష్టం అంతా ఇంతా కాదు. దాదాపు దశాబ్దంన్నరగా ఆ వెబ్ సైట్ కోలీవుడ్ జనాలను వేధిస్తోంది. కొత్త సినిమా ఇలా రిలీజ్ కావడం ఆలస్యం.. కొన్ని గంటల్లో ఆ వెబ్ సైట్‌లో ప్రత్యక్షం అయిపోతుంది. సినిమా పైరసీ కాకుండా ఎన్ని చర్యలు చేపట్టినా.. థియేటర్లను ఎంతగా కట్టడి చేసినా.. ఆ వెబ్ సైట్ నిర్వాహకులు మాత్రం ఎలాగోలా పైరసీ వెర్షన్‌ను బయటికి తెచ్చేస్తారు.
ఈ వెబ్ సైట్ మీద సైబర్ పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. అత్యున్నత స్థాయిలో దాన్ని నియంత్రించేందుకు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ వెబ్ సైట్‌ను ఇంటర్నెట్లో శోధిస్తే పని చేయట్లేదనే సమాచారమే కనిపిస్తుంది. కానీ ఆ వెబ్ సైట్ ద్వారా పైరసీ సినిమాలు మాత్రం ఆగవు.
కొన్నేళ్లుగా తన సబ్‌స్క్రైబర్లను మెయిల్ ద్వారా పైరసీ లింకులు పంపించి వాళ్లను ఎంగేజ్ చేస్తూ వస్తోందా వెబ్ సైట్. ఐతే ఇప్పటిదాకా కోలీవుడ్ నుంచి విశాల్ సహా ఎంతోమంది పెద్దలు ఆ వెబ్ సైట్‌ను నియంత్రించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా.. ఇప్పుడు అమేజాన్ ప్రైమ్ దాని పని పట్టేసింది. ప్రైమ్‌లో వచ్చే కొత్త సినిమాలన్నింటినీ కూడా ఈ వెబ్ సైట్ పైరసీ చేసి తన సబ్‌స్క్రైబర్లకు అందిస్తున్నట్లు.. తమకు భారీగా నష్టం చేకూరుస్తున్నట్లు తెలుసుకున్న ప్రైమ్ టీం.. అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి ఈ వ్యవహారాన్ని డీల్ చేసింది.
వాళ్లు ఆ వెబ్ సైట్ సర్వర్లన్నింటినీ బ్లాక్ చేశారు. దీంతో తమిళ్ రాకర్స్‌కు గట్టి దెబ్బ తగిలింది. ఇకపై కొత్త సినిమాల పైరసీ వెర్షన్లు అందించలేమని.. తమ సర్వర్లన్నీ బ్లాక్ అయిపోయాయని సబ్‌స్క్రైబర్లకు తమిళ్ రాకర్స్ మెయిల్స్ పెట్టేసింది. ఇలా ఇంతకుముందెన్నడూ జరిగింది లేదు. మొత్తానికి తమిళ సినీ పరిశ్రమ ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాని పనిని అమేజాన్ చేసిందంటూ దానిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
This post was last modified on October 21, 2020 9:59 am
తమిళ స్టార్ హీరో విశాల్.. ఇటీవల వార్తల్లో వ్యక్తిగా మారిన సంగతి తెలిసిందే. ఎప్పుడో పుష్కర కాలం కిందట విడుదల…
మంచు విష్ణు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న కన్నప్ప ఏప్రిల్ 25 విడుదల నిర్ణయంలో ఎలాంటి మార్పు…
రౌడీ బాయ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ 12 విడుదల తేదీని మే 30కి లాక్ చేసినట్టు…
ఒక రీమేక్ ఎంచుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో దర్శకులకు పెద్ద సవాల్ గా మారిపోయింది. ఒరిజినల్ వెర్షన్ ని సబ్ టైటిల్స్…
గడచిన రెండు, మూడు రోజులుగా ఏపీలో ఒకటే రచ్చ. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె గ్రాడ్యుయేషన్…