Movie News

ఇద్దరి మీద సుకుమార్ దాచుకోలేనంత ప్రేమ

ఆర్యలో అల్లు అర్జున్ డైలాగు ఒకటుంది. హీరోయిన్ కు తన ప్రేమను ఎక్స్ ప్రెస్ చేసే క్రమంలో దాచుకోలేనంత ఉందని చెబుతాడు. అచ్చంగా ఇదే సుకుమార్ నిజ జీవితంలో ప్రదర్శించారు. ఇవాళ జరిగిన పుష్ప 2 ది రూల్ థాంక్స్ మీట్ లో ఈ సన్నివేశం కనిపించింది.

దేవిశ్రీప్రసాద్ పేరుని తన పేరుతో పాటు జోడించాలని ఉందని, తను లేకుండా భవిష్యత్తులో సినిమా చేయలేనేమో అని సందేహం వ్యక్తం చేస్తూ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ని బహిరంగంగా చెప్పుకున్నారు. జగడం, 1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప 1 ది రైజ్ ఇలా వీళ్ళ ప్రయాణం దేవికి జాతీయ అవార్డు వచ్చేదాకా ఇంకా ఇప్పటికీ కొనసాగుతోంది.

ఇక అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ తన ఇంటి దగ్గర ఇద్దరు వృద్ధులు కలిసి పుష్పలో బన్నీ అదరగొట్టేశాడని, ఇంకా చెప్పాలంటే ఎస్వి రంగారావు లేని లోటు తీర్చినట్టు అయ్యిందని వాళ్ళు చెప్పడం విని ఆశ్చర్యానికి గురయ్యాయని సుకుమార్ వివరించారు. అయితే ఎస్విఆర్ కు డాన్సులు, ఫైట్లు రావు కాబట్టి ఆ కోణంలో చూసుకుంటే బన్నీనే రెండు మెట్లు పైనున్నాడని అర్థం వచ్చేలా ఆ ఇద్దరు కామెంట్ చేశారని వివరించారు.

ఇదేదో ట్రోలింగ్ కు అవకాశం ఇవ్వడానికో, లేక మహానటుడిని పోల్చడానికో కాదని క్లారిటీ ఇచ్చారు. గతంలో ఈ ముచ్చట్లు పంచుకునే సందర్భం సుకుమార్ కు రాలేదు. రెండు నెలల తర్వాత కుదిరింది.

ఈ రోజు పుష్ప 2 వేడుకతో ఇక అన్ని ప్రమోషన్లకు ముగింపు పలికినట్టే. ఇటీవలే రీ లోడెడ్ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. మిలియన్ల వ్యూస్ తో కొత్త రికార్డులకు పరుగులు పెడుతోంది. అర్ధశతదినోత్సవం పూర్తి చేసుకున్నాక ఓటిటిలో రావడంతో థియేట్రికల్ గా చాలా ప్లస్ అయ్యింది.

వసూళ్ల లెక్కల గురించి ఎక్కువ ప్రస్తావన జరగకపోవడం గమనార్హం. సుకుమార్ చెప్పిన మాటలల్లో లోతైన అర్థం తీసుకుంటే రామ్ చరణ్ 17కి దేవిశ్రీ ప్రసాద్ పనిచేయడం, పుష్ప 3 ది ర్యాంపేజ్ కి ఛాన్స్ ఉండటం కనిపిస్తోంది. ఏది నిజమైనా అభిమానులకది పండగ లాంటి శుభవార్తే.

This post was last modified on February 8, 2025 10:31 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

25 minutes ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

1 hour ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

1 hour ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

2 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

2 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

3 hours ago