Movie News

విడాకుల గురించి చైతూ : “తనకి అసలు సంబంధం లేదు”

అక్కినేని నాగచైతన్య-సమంతల జోడీని చూస్తే ముచ్చటేసేది అభిమానులకు. టాలీవుడ్లో మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్స్‌లో ఒకరిగా వీరిని చూసేవారు. అలాంటి జంట విడిపోవడం అభిమానులకు పెద్ద షాక్. ఈ విషయాన్ని చాన్నాళ్ల పాటు జీర్ణించుకోలేకపోయారు. ఈ విషయంలో అభిమానుల్లో ఓ వర్గం చైతూను, ఇంకో వర్గం సమంతను నిందించారు. అసలు విడాకులకు కారణాలేంటి అనే చర్చ చాన్నాళ్ల పాటు సాగింది.

ఇప్పుడు చైతూ, సమంతల్లాగే మూవ్ ఆన్ అయిపోయి ఆ విషయాన్ని పక్కన పెట్టేశారు. ఇలాంటి సందర్భంలో చైతూ విడాకుల గురించి ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సమంత పేరెత్తకుండానే తన తొలి వివాహ బంధం నిలబడకపోవడం గురించి చైతూ మాట్లాడాడు. విడాకులు ఎంతో బాధాకర నిర్ణయమని.. పరస్పర అంగీకారంతోనే ఆ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు.

ఈ సందర్భంగా తన తల్లిదండ్రుల విడాకుల గురించి కూడా అతను మాట్లాడాడు.‘‘నేనొక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. భార్యాభర్తలు విడిపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు. దాని వల్ల నేనెంతో బాధను అనుభించాను కాబట్టి.. నా జీవితంలో అలాంటి నిర్ణయం తీసుకోవాలంటే అంత తేలిక కాదు. వెయ్యిసార్లు ఆలోచించాకే నిర్ణయం తీసుకుంటా. విడాకుల నిర్ణయం ఒక్క రోజులో తీసుకుంది కాదు. చాన్నాళ్ల పాటు దాని గురించి ఆలోచించాం.

కచ్చితంగా అది బాధ పెట్టే నిర్ణయం. కానీ ఏది జరిగినా ఒక కారణంతోనే జరుగుతుంది. అది ఇద్దరి మంచికే అని నా భావన. అందుకే ఇద్దరం కలిసి పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకున్నాం. ఆ తర్వాత ఇద్దరి జీవితాల్లో మంచి జరుగుతుందని అనుకున్నాం. ఆ ప్రకారమే జరుగుతోందని అనుకుంటున్నా’’ అని చైతూ చెప్పాడు.

మరోవైపు ఇదే ఇంటర్వ్యూలో నెపోటిజం గురించి ప్రశ్న ఎదురు కాగా.. ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని ఆసక్తికర ప్రశ్న వేశాడు చైతూ. రేప్పొద్దున మీ పిల్లలు ఇదే వృత్తిలోకి వస్తామంటే ఆపుతారా.. అలాగే నటన మీద తనకు ఆసక్తి ఉందని అంటే తన తండ్రి ఎందుకు కాదని అంటారని.. ఇందులో ఆయన తప్పైనా, తన తప్పైనా ఉందా అని చైతూ ప్రశ్నించాడు.

This post was last modified on February 8, 2025 6:55 pm

Share

Recent Posts

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

16 minutes ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

1 hour ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

2 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

3 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

5 hours ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

5 hours ago