రెండేళ్ల కిందట తమిళంలో లవ్ టుడే అనే చిన్న సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసింద తెలిసిందే. ప్రదీప్ రంగనాథన్ అనే యువ దర్శకుడు తనే హీరోగా నటిస్తూ రూపొందించిన ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయి కూర్చుంది. సోషల్ మీడియా కాలంలో ప్రేమలు ఎలా ఉన్నాయో చూపిస్తూ.. ఓవైపు ఉత్కంఠ రేకెత్తిస్తూ, ఇంకోపక్క వినోదంలో ముంచెత్తుతూ సాగిన ఈ సినిమా యువ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.
అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తే ఇక్కడా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని ఇప్పుడు లవ్ యాపా హిందీలో రీమేక్ చేశారు. ఇందులో ఇద్దరు పెద్ద తారల పిల్లలు లీడ్ రోల్స్ చేయడం విశేషం. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్, శ్రీదేవి తనయురాలు ఖుషి కపూర్ ఈ చిత్రంతోనే నటనలోకి అరంగేట్రం చేశారు. దీంతో బాలీవుడ్ దృష్టి ఈ సినిమాపై కేంద్రీకృతం అయింది.
సౌత్‌లో సూపర్ హిట్ అయిన, ట్రెండీ మూవీని జునైద్, ఖుషిల లాంచ్ కోసం ఎంచుకోవడం బాగానే ఉంది కానీ.. ఒరిజినల్లో ఉన్న ఫన్‌ను ఇక్కడ రీక్రియేట్ చేయలేకపోయారన్నది టాక్. ఆమిర్ ఖాన్ మాజీ మేనేజర్.. సీక్రెట్ సూపర్ స్టార్, లాల్ సింగ్ చడ్డా లాంటి చిత్రాలను రూపొందించిన అద్వైత్ చందన్ ఈ సినిమాను రూపొందించాడు. చాలా వరకు ఒరిజినల్‌నే ఫాలో అయినప్పటికీ.. మాతృకలో మాదిరి ప్రేక్షకులను నవ్వించలేకపోయాడంటున్నారు.
లీడ్ ఆర్టిస్టులు ఈ సినిమాకు సూట్ కాలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జునైద్, ఖుషిలిద్దరి గురించీ నెగెటివ్ ఫీడ్ బ్యాకే వస్తోంది. వాళ్లు ఈ పాత్రలకు మిస్ ఫిట్ అంటున్నారు. బాలీవుడ్ ప్రముఖులకు ముందే ప్రివ్యూలు వేసి టీం హడావుడి చేసింది కానీ.. ప్రేక్షకుల్లో లవ్ యాపా సినిమా పట్ల పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. ఓపెనింగ్స్ కూడా డల్లుగా ఉన్నాయి. టాక్ కూడా అంతంతమాత్రంగా ఉండడంతో ఈ సౌత్ సూపర్ హిట్ మూవీ.. బాలీవుడ్లో సక్సెస్ అయ్యే అవకాశాలు అంతగా కనిపించడం లేదు.
This post was last modified on February 8, 2025 10:34 am
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…