స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా నిన్న జాక్ టీజర్ విడుదల చేశారు. ఏప్రిల్ 10 విడుదల కాబోతున్న ఈ యాక్షన్ కం కం కామెడీ ఎంటర్ టైనర్ కు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. కంటెంట్ పెద్దగా దాచకుండా స్టోరీ లైన్ చెప్పేశారు. ఇంట్లో చేస్తున్న ఉద్యోగం చెప్పకుండా బయట సరదాగా తిరిగే యువకుడి వెనుక పెద్ద యాక్షన్ సెటప్ ఉంటుంది.
అది ఏకంగా దేశానికి ద్రోహం చేస్తున్న వాళ్ళతో ముడిపడినది కావడంతో కుర్రాడు ఫైట్లు చేస్తూ యుద్ధాలకు దిగుతాడు. వీటికి తోడు ఒక లవ్ స్టోరీ ఉంటుంది. లైన్ ఆసక్తికరంగానే ఉంది. ఇక్కడ తనది సేఫ్ గేమ్ అనేందుకు కారణాలున్నాయి.
సిద్దు ఇప్పటిదాకా ప్రూవ్ చేసుకుంది టిల్లు బ్రాండ్ తోనే. రెండూ బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టాయి. టిల్లు పాత్రలో ఉన్న కామెడీ టైమింగ్ సిద్దు జొన్నలగడ్డ ప్రదర్శించిన తీరు యూత్ ని బాగా దగ్గర చేసింది. రాధికా రాధికా అంటూ చేసిన అల్లరి ఓ రేంజ్ లో పేలింది. జాక్ విషయానికి వస్తే ఇది పూర్తి విభిన్నమైన పాయింట్ తో రూపొందింది.
అండర్ కవర్ కథల్లో సీరియస్ హీరోలను చూడటం ఎక్కువ కానీ ఇలా వినోదాత్మకంగా నవ్వించే ప్రయత్నం అరుదు. ఒకటి రెండు సినిమాల్లో తప్ప మిగిలినవి తనదైన ఫన్ టచ్ ఇచ్చిన బొమ్మరిల్లు భాస్కర్ ఈ సారి వేరే రూటు తీసుకున్నాడు. సో సిద్దుకిది సక్సెస్ కావడం చాలా కీలకం.
తర్వాత వచ్చే లైనప్ కూడా ఇదే తరహాలో ఉంది. తెలుసు కదా ఇద్దరు అమ్మాయిల ప్రేమతో ముడిపడిన కూల్ లవ్ స్టోరీ. ఎమోషన్లకు పెద్ద పీఠ వేస్తున్నారు. శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్లు. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న కోహినూర్ రెండు భాగాలుగా పీరియాడిక్ సెటప్ లో రూపొందిన భారీ ప్యాన్ ఇండియా మూవీ.
సో టిల్లు ఛాయలు, షేడ్స్ ఏవి సిద్దు నుంచి రాబోయే మూడు సినిమాల్లో ఉండవు. మార్కెట్ తో పాటు ఇమేజ్ పెంచుకునే పనిలో ఉన్న సిద్ధూ జొన్నలగడ్డ డిఫరెంట్ జానర్స్ టచ్ చేయడం అవసరం. దానికి అనుగుణంగానే ప్లాన్ చేసుకుంటున్నాడు. రిలీజుల మధ్య గ్యాప్ కూడా తక్కువే ఉండనుంది.
This post was last modified on February 8, 2025 9:05 am
నిన్న విడుదలైన తండేల్ కు పాజిటివ్ టాక్ రావడంలో దేవిశ్రీప్రసాద్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించని వాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు.…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన విధినిర్వహణలో దూసుకుపోతున్నారు. పాలనలో కీలకమైన గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ…
కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా… అందులో ఎదో ఒక మెలిక ఉండనే ఉంటుంది. ఈ తరహా నిర్ణయాలను కేంద్రం తెలిసి…
తెలంగాణాలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే… ఆ వార్తలన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
సీఎం చంద్రబాబుపై ఎప్పుడు బురదజల్లుదామా అనే కాన్సెప్ట్ తో వైసీపీ నేతలు రెడీగా ఉంటారని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. చంద్రబాబు…
ఏపీలోని పేద ప్రజల గుండెకు భరోసా అందించే దిశగా కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అమలులోకి…