తండేల్ ప్రమోషన్లలో భాగంగా అల్లు అరవింద్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మగధీర తన మేనల్లుడు రామ్ చరణ్ కు ఎలాగైనా హిట్టు దక్కాలన్న ఉద్దేశంతో రాజమౌళితో చేశానని, అందుకే ఎంత బడ్జెట్ అయినా లెక్కపెట్టలేదని చెప్పుకొచ్చారు. చిరుత యావరేజ్ కావడం వల్ల ఈసారి అలాంటి ఫలితం రాకూడదనే ఈ రూపంలో ప్రేమ చూపించానని చెప్పడం రకరకాలుగా వెళ్ళిపోతోంది.
మళ్ళీ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అభిమానులు గొడవ మొదలైపోయింది. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గేమ్ ఛేంజర్ గురించి అరవింద్ అన్న మాటలను అనవసరంగా అపార్థం చేసుకున్నారనే డిబేట్ చూశాంగా.
మేనమామ పూనుకున్నాడు కాబట్టే చరణ్ కు అంత పెద్ద హిట్టు దక్కిందనేది ఒక వర్గం నుంచి వినిపిస్తున్న వాదన. మరోవైపు మగధీరకు ప్యాన్ ఇండియా స్టామినా ఉన్నా కావాలనే తమిళ, హిందీ వెర్షన్లను సకాలంలో రిలీజ్ చేసే చొరవ తీసుకోలేదనేది ఇటు పక్క వస్తున్న కౌంటర్.
దానికి సాక్ష్యంగా గతంలో మగధీర బ్లూ రే డిస్కుతో పాటు ఇచ్చిన మేకింగ్ వీడియోలో రాజమౌళి ఇంటర్వ్యూని తీసుకొచ్చి వైరల్ చేస్తున్నారు. ఇది ఇతర భాషల్లో డబ్బింగ్ అయ్యుంటే బాగుండేదని ఆయనన్న మాట ఉంది. చాలా ఏళ్ళ క్రితం వేరే ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తెలుగు అనువాదాలు తమిళంలో ఆడలేకపోతున్న వైనాన్ని వివరించడం తవ్వి తెచ్చారు.
ఇదంతా పక్కనపెడితే మగధీర గురించి ఇప్పుడు చర్చే అనవసరమని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరు ఔనన్నా కాదన్నా టాలీవుడ్ స్థాయిని పెంచిన సినిమాల్లో దీనిది ప్రత్యేక స్థానం. ఇండస్ట్రీ రికార్డుల పరంగానే కాదు కంటెంట్ లోనూ తిరుగులేని రీతిలో ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది.
బాహుబలి, ఆర్ఆర్ఆర్ గొప్పవే కావొచ్చు కానీ వాటికి బలమైన పునాది వేసింది మగధీరనే. దానికి ముగ్గురు కారణం. అల్లు అరవింద్, రామ్ చరణ్, రాజమౌళి. ఎవరు చేయకపోయినా ఇవాళీ టాపిక్ వచ్చేది కాదు. సో మేం గొప్పంటే మేం గొప్పనే పాత డిస్కషన్ల కన్నా ఎస్ఎస్ఎంబి 29, ఆర్సి 16 ఇంకా గొప్పగా రావాలని కోరుకోవడం బెటర్.
Gulte Telugu Telugu Political and Movie News Updates