ఏప్రిల్ 10 ది రాజా సాబ్ రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే అయినా టీమ్ ఇప్పటిదాకా ఆ విషయాన్ని అఫీషియల్ గా చెప్పకపోవడం ప్రభాస్ అభిమానులను టెన్షన్ పెడుతోంది. ఎలాగూ నిజమే కాబట్టి వీలైనంత త్వరగా కొత్త డేట్ ప్రకటించమని కోరుతున్నారు. అయితే నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పలు ఆప్షన్లను సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ముఖ్యంగా పోటీ లేని సోలో రిలీజ్ డేట్ అయితే బాలీవుడ్ మార్కెట్ ని సమాంతరంగా టార్గెట్ చేసినట్టవుతుందనే ఆలోచనలో దేవర, పుష్ప 2, కల్కి లాగా మంచి విడుదల తేదీని సెట్ చేసే చర్చల్లో తలమునకలైనట్టు సమాచారం.
వేసవిలో వచ్చే అవకాశాలు కూడా తక్కువే కనక దసరా వైపు చూస్తున్నట్టు తెలిసింది. అయితే ఇక్కడో చిక్కుంది. సెప్టెంబర్ 25 బాలకృష్ణ అఖండ 2 తాండవం, సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు రెండు ఒకే రోజు వస్తున్నాయి. విజయదశమి అక్కడికి కేవలం వారం దూరంలోనే ఉంటుంది.
ఒకవేళ వీటికి హిట్ టాక్ వస్తే ఆశించిన స్థాయిలో రాజా సాబ్ కు థియేటర్లు దక్కవు. ఇక్కడితో అయిపోలేదు. అక్టోబర్ 2 కాంతార చాప్టర్ 1 దిగుతుంది. దీని మీదున్న హైప్ గురించి చెప్పనక్కర్లేదు. ఈ డేట్ మిస్ చేయకూడదనే లక్ష్యంతో దర్శకుడు కం హీరో రిషబ్ శెట్టి షూటింగ్ ఎక్కడా ఆపకుండా చేస్తున్నాడు.
సో ఒకవేళ ఈ ప్రతిబంధకాలు వద్దనుకుంటే ది రాజా దీపావళి లేదా ఇంకో ప్రత్యాన్మయం వైపు చూడాలి. దీపావళి సీజన్ అంతగా ఎక్కువ వర్కౌట్ అయ్యే సీజన్ కాదు కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి అడుగులు వేయాలి. అందులోనూ నార్త్ మార్కెట్ ప్రభాస్ కు చాలా కీలకం కాబట్టి హిందీ క్లాష్ లేకుండా చూసుకోవాలి.
ఆగస్ట్ లో ఛాన్స్ ఉన్నా వార్ 2 ఉన్న నేపథ్యంలో అంత పెద్ద మల్టీస్టారర్, పైగా యష్ రాజ్ ఫిలింస్ నిర్మాణం. సో క్లాష్ అంత సేఫ్ కాదు. ఈ లెక్కలన్నీ చూసుకోబట్టే ది రాజా సాబ్ అనౌన్స్ మెంట్ ఆలస్యమవుతోంది. దర్శకుడు మారుతీ ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణకు తీసుకొచ్చారని తెలిసింది.
This post was last modified on February 6, 2025 2:31 pm
అమెరికా ప్రభుత్వం అక్రమంగా ఉన్న 104 మంది భారతీయులను దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పంజాబ్లోని అమృత్సర్కు ప్రత్యేక…
ఆస్ట్రేలియా జట్టు ఈసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో స్ట్రాంగ్ టీమ్ గా రాబోతోంది అనుకుంటున్న టైమ్ లో ఊహించని పరిణామాలు…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం రిలీజైన జానీ ఇప్పటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కల్ట్ లా ఫీలవుతారేమో కానీ…
ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ ప్రెషన్ ని తన ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా…
అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…
కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…