ఇవాళ పట్టుదల (విడాముయార్చి) విడుదలయ్యింది. దీనికి ముందు నుంచి పెద్దగా బజ్ లేదు. టీజర్, ట్రైలర్ అంతగా ఆకట్టుకోలేదు. హాలీవుడ్ ఇన్స్ పిరేషన్ తో తీయడం వల్ల మాస్ కి ఎక్కడం కష్టమే అనిపించింది. అందుకే తెలుగు వెర్షన్ లో సున్నా అంచనాలున్నాయి. కానీ తమిళంలో మాత్రం అజిత్ తన స్టార్ పవర్ ఎంత ఉందో మరో సారి నిరూపిస్తున్నాడు.
అడ్వాన్స్ బుకింగ్స్ లో ఏకంగా తెగింపు, గోట్ లను టచ్ చేసే స్థాయిలో ఓపెనింగ్స్ ఫిగర్స్ నమోదు చేస్తున్నాడు. యుఎస్ ప్రీమియర్ల టాక్ మిశ్రమంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఇది ఏ మేరకు హిట్ టాక్ తెచ్చుకుని నిలబడుతుందనేది చెప్పలేం.
ఇదంతా మైత్రికి పెద్ద జాక్ పాట్ లా మారబోతోంది. ఎందుకంటే అజిత్ నెక్స్ట్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ నిర్మాతలుగా దాని మీదున్న హైప్ కు ఆకాశమే హద్దుగా బిజినెస్ జరగడం ఖాయం. అసలే అజిత్ ని ఊర మాస్ అవతారంలో చూసి సంవత్సరాలు గడిచిపోయాయి. గ్యాంబ్లర్ తర్వాత అలాంటి లుక్ మళ్ళీ గుడ్ బ్యాడ్ అగ్లీలోనే చూపించబోతున్నారు.
అందులోనూ దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ అజిత్ కు ప్రాణమిచ్చే వీరాభిమాని. సో ఎలా చూపిస్తాడో చెప్పనక్కర్లేదు. ఒకటి రెండు కాదు డిఫరెంట్ షేడ్స్ లో తలా విశ్వరూపం ఉంటుందని ఇప్పటికే చెన్నై మీడియా వర్గాల్లో బలమైన టాక్ ఉంది.
ఇంకా గుడ్ బ్యాడ్ అగ్లీకు సంబంధించిన ప్రమోషన్లు మొదలుపెట్టలేదు. ఏప్రిల్ 10 విడుదల తేదీ మాత్రమే లాక్ చేశారు. వచ్చే నెల నుంచి పబ్లిసిటీ వేగం పెంచబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు, జివి ప్రకాష్ కుమార్ నేపధ్య సంగీతం అంచనాలు పెంచుతున్నాయి.
కథకు సంబంధించిన క్లూస్ బయటికి రాలేదు కానీ అజిత్ మంచివాడు, చెడ్డవాడిగా డ్యూయల్ రోల్ చేశాడనే లీక్ అయితే చక్కర్లు కొడుతోంది. ముందస్తు అంచనా ప్రకారం ఈ సినిమా కనీసం వంద కోట్ల ఓపెనింగ్ తో మొదలువుతుందని కోలీవుడ్ ట్రేడ్ అంచనా. తెలుగులోనూ క్రేజ్ వచ్చేలా ప్రమోషన్లు ప్లాన్ చేయబోతున్నారని సమాచారం.
This post was last modified on February 6, 2025 10:39 am
అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…
కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…
ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలానాలు విధిస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. ఇంతవరకు ఓకే. హైదరాబాద్ మహానగరంలో అయితే.. ట్రాఫిక్ నియంత్రణ వదిలేసి…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…
వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…