‘ఆర్ఎక్స్ 100’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు అజయ్ భూపతి, మళ్లీ తన పవర్ చూపించిన సినిమా.. మంగళవారం. 2023 నవంబరులో రిలీజైన ఈ సినిమా థ్రిల్లర్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంది. మలయాళం థ్రిల్లర్స్ చూసి ఇలాంటి సినిమాలు తెలుగులో తీయరేంటి అనుకునేవాళ్లకు ఈ చిత్రం సమాధానంగా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర ఇంకా మంచి ఫలితం రావాల్సింది కానీ.. ఓటీటీలో మాత్రం దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
అనేక చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై అవార్డులు గెలుచుకుందీ చిత్రం. ‘మంగళవారం’ తర్వాత అజయ్ వేరే సినిమా చేయాల్సింది కానీ.. అది ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడతను ‘మంగళవారం’ సీక్వెల్‌తోనే రాబోతున్నాడు. ఈ చిత్రానికి స్క్రిప్టు వర్క్ పూర్తి కావస్తోంది. త్వరలోనే సినిమాను అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఐతే ‘మంగళవారం-2’కు సంబంధించి ఒక ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. ఇందులో లీడ్ రోల్ పాయల్ రాజ్‌పుత్ చేయట్లేదట.
అజయ్ తొలి చిత్రం ‘ఆర్ఎక్స్ 100’లో పాయల్ రోల్, తన పెర్ఫామెన్స్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో తెలిసిందే. ‘మంగళవారం’లో అంతకుమించిన పాత్ర ఆమెది. హార్మోన్ల సమస్య వల్ల కోరికలు అదుపు చేసుకోలేక ఇబ్బంది పడే పాత్రను చేయడానికి అందరు హీరోయిన్లూ ఒప్పుకోరు. పాయల్ ఆ పాత్రను ఎంతో కన్విన్సింగ్‌గా చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా చూశాక అందులో మరో హీరోయిన్ని ఊహించుకోలేం.
అంత బాగా ఆ పాత్రను పండించింది పాయల్. అలాంటి పెర్ఫామెన్స్ తర్వాత సీక్వెల్లో పాయల్ లేదంటే తన అభిమానులు ఒకింత నిరాశచెందుతారనడంలో సందేహం లేదు. కానీ ‘మంగళవారం’ కథలో ఆమె పాత్ర ముగిసిపోయింది కాబట్టి.. సీక్వెల్లో తనను కొనసాగించడానికి వీల్లేదు. పైగా వేరే హీరోయిన్ని పెట్టి కొత్త కథ చెప్పబోతున్న సంకేతాలు కూడా ఇవ్వాలి. అందుకే పాయల్‌కు ఈ సినిమాలో అవకాశం లేదని భావించాలి.
This post was last modified on February 5, 2025 1:25 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…