పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే. ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రం అనుకున్నంత ఆడకపోయినా.. ఆ సినిమాతో పూజా పేరు మార్మోగి తెలుగులో వరుసగా పెద్ద పెద్ద సినిమాల్లో నటించింది. అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో లాంటి ఘనవిజయాలు ఆమె ఖాతాలోకి వచ్చాయి. కొన్నేళ్ల పాటు తెలుగులో ఒక వెలుగు వెలిగింది పూజా.
ఐతే ఈ మధ్య తన కెరీర్ గాడి తప్పింది. తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. ఇతర భాషల్లో సినిమాలు చేస్తోంది. ఐతే తన కొత్త హిందీ చిత్రం ‘దేవా’ రిలీజ్ నేపథ్యంలో ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ.. పూజ చేసిన వ్యాఖ్యలు తెలుగు నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. తన కెరీర్లోనే అతి పెద్ద హిట్‌గా నిలిచిన ‘అల వైకుంఠపురములో’ను తమిళ చిత్రంగా పేర్కొనడం ఇందుక్కారణం.
తాను దక్షిణాదిన చేసిన రీజనల్ మూవీస్‌ను కూడా హిందీ ప్రేక్షకులు బాగా చూశారని చెప్పే క్రమంలో ‘అల వైకుంఠపురములో’ ప్రస్తావన తెచ్చింది పూజా. ఈ సందర్భంగా దాన్ని తమిళ చిత్రంగా పేర్కొంది. దాంతో పాటుగా ‘డీజే’ గురించి కూడా మాట్లాడింది. ఇవి పాన్ ఇండియా మూవీస్ కాకపోయినా హిందీ ప్రేక్షకులు బాగా చూశారని.. కాబట్టి కంటెంట్ అనేదే ముఖ్యమని ఆమె వ్యాఖ్యానించింది. ఐతే తన కెరీర్‌ను మలుపు తిప్పింది.. ఎక్కువ అవకాశాలు ఇచ్చింది తెలుగు సినీ పరిశ్రమే.
తమిళంలో చేసిన రెండు మూడు సినిమాలు ఆమెకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. అలాంటిది పొరపాటున అయినా తెలుగు సినిమాలను తమిళంవి అని ఎలా చెబుతుంది అనేది మనవారి మాట. సౌత్ ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలియని బాలీవుడ్ వాళ్లు తెలుగు సినిమాలను తమిళ చిత్రాలుగా పేర్కొనడం ఒకప్పుడు జరిగేది.
కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇండియాలోనే నంబర్ వన్ స్థాయికి ఎదిగి.. అంతర్జాతీయంగా కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్న ఈ రోజుల్లో కూడా తెలుగులో ఒక వెలుగు వెలిగిన ఒక కథానాయిక తాను నటించిన దాన్ని తమిళ చిత్రంగా పేర్కొనడం క్షమార్హం కాని తప్పు అంటూ ఆమె మీద తెలుగు నెటిజన్లు మండిపడుతున్నారు. మరి కొందరేమో పొరపాటున జారిన మాట అయ్యుండొచ్చు అని కామెంట్ చేస్తున్నారు.
This post was last modified on February 4, 2025 10:21 pm
తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…
ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…
తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం…
ఏపీలో కూటమి ప్రభుత్వం చేసే ఖర్చులు, తీసుకునే నిర్ణయాలను సమీక్షించి.. నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేకంగా మూడు కమిటీలు ఉంటాయి. ఇది…