అన్నం మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉందన్నట్టు ఈ సూత్రం సినిమాలకు కూడా వర్తిస్తుంది. ఒకరితో అనుకున్నది మరొకరితో తెరకెక్కించి ఆశించిన ఫలితం అందుకోనప్పుడు ఆ దర్శకులు పడే బాధ వర్ణనాతీతం. వాళ్ళు చెబితే తప్ప ఇవి బయట ప్రపంచానికి తెలియవు. కృష్ణవంశీ అలాంటిదే ఒకటి పంచుకున్నారు.
గత కొంత కాలంగా ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉన్న ఆయన్ను ఒక అభిమాని శ్రీ ఆంజనేయంని ముందు జూనియర్ ఎన్టీఆర్ తో అనుకున్నారాని అడిగాడు. దానికాయన కాదని సమాధానం చెబుతూ కథ రాసుకున్నది చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని అని, కానీ నా దురదృష్టం వల్ల జరగలేదని అన్నారు.
ఇంకొంచెం లోతైన వివరాల్లోకి వెళదాం. 2004లో వచ్చిన శ్రీ ఆంజనేయంని చిరంజీవితో కనక కృష్ణవంశీ చేసి ఉంటే నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళేది. యాక్షన్ కింగ్ అర్జున్ పోషించిన అంజనీ పుత్రుడు పాత్రకు బెస్ట్ ఛాయస్ కావడంతో పాటు సినిమా రేంజ్ కి చాలా ఉపయోగపడేది.
కానీ అప్పటికే నాలుగేళ్ల క్రితం 2001లో శ్రీ మంజునాథతో చిరు మిశ్రమ ఫలితం అందుకోవడంతో మరోసారి దేవుడిగా కనిపించేందుకు ఇష్టపడలేదు. అందులోనూ తన ఆరాధ్య దైవం. పైగా స్క్రిప్ట్ లో ప్రేమకథ పేరుతో కృష్ణవంశీ ఘాటైన రొమాన్స్ రాశాడు. ముఖ్యంగా ఛార్మీని చూపించిన విధానం మీద అప్పట్లో విమర్శలు వచ్చాయి.
సో వదులుకోవడం ఒకరకంగా మంచిదే అయ్యింది. ఇది కాకుండా కృష్ణవంశీ వందేమాతరం పేరుతో మరో ప్యాన్ ఇండియా మూవీని మెగాస్టార్ తో తీయాలని బలంగా ప్రయత్నించారు. బడ్జెట్ చాలా ఎక్కువగా డిమాండ్ చేయడంతో పాటు అప్పుడున్న పరిస్థితుల్లో ఫ్రీడమ్ ఫైట్ నేపధ్యాలు కమర్షియల్ గా వర్కౌట్ కావని భావించి ఏ నిర్మాతా ముందుకు రాలేదు.
అది కాస్తా కథ స్టేజి దగ్గరే ఆగిపోయింది. ఇలా రెండుసార్లు ఛాన్స్ మిస్ చేసుకున్న కృష్ణవంశీ తర్వాత చిరు వారసుడు రామ్ చరణ్ తో గోవిందుడు అందరివాడేలే చేశారు కానీ దాని ఫలితం నిరాశపరచడం ఊహించని మలుపు. కొన్ని కథలంతే. కంచికి చేరవు.
This post was last modified on February 4, 2025 8:52 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…