అనుకున్నట్టే పుష్ప 2 ది రూల్ ఓటిటిలోకి వచ్చాక సంచలనాలు మొదలుపెట్టింది. వ్యూస్ పరంగా ఎన్ని రికార్డులు నమోదయ్యాయనేది బయటికి రావడానికి ఇంకా టైముంది కానీ క్లైమాక్స్ లో అల్లు అర్జున్ నటనకు ఫారినర్లు ఫిదా అవుతున్న వైనం సోషల్ మీడియాలో కనిపిస్తోంది.
ముఖ్యంగా రప్పా రప్పా అంటూ విలన్ గ్యాంగ్ ని వెంటాడుతూ చేసే ఊచకోతని వీడియో రూపంలో షేర్ చేసుకుని తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఉదాహరణకు నిన్న రాత్రి ఒక విదేశీ ట్విట్టర్ హ్యాండిల్ లో రెండు నిమిషాల వీడియో పోస్ట్ చేస్తే గంటల నిడివిలో రెండు మిలియన్ల వ్యూస్ దాటడం క్రేజ్ కు నిదర్శనం.
కామెంట్స్ లో అధిక శాతం ప్రశంసలతో నిండిపోయాయి. సినిమా మీద అవగాహన లేని వాళ్ళు టైటిల్ ఏంటో కనుక్కుని మరీ నెట్ ఫ్లిక్స్ కి వెళ్తున్న వైనం కనిపిస్తోంది. ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్ ప్రస్తుతానికి అందుబాటులో లేకపోయినా సబ్ టైటిల్స్ సహాయంతో చూసేస్తున్నారు. కేవలం ఒక ట్వీట్ కే ఇంత రెస్పాన్స్ ఉంటే ఇక మొత్తం తరచి చూస్తే ఇంకెన్ని బయట పడతాయో చెప్పడం కష్టం.
ఊర మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందిన పుష్ప 2 కి అదనంగా ఇరవై నిముషాలు జోడించి మల్టీ లాంగ్వేజెస్ లో రీ లోడెడ్ వెర్షన్ స్ట్రీమింగ్ చేయడం ఎక్కువ శాతం ప్రేక్షకులను మళ్ళీ వచ్చి చూసేలా చేస్తోంది.
చూస్తుంటే ఆర్ఆర్ఆర్ స్థాయి స్పందన వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని బన్నీ ఫ్యాన్స్ ఫీలింగ్. చైనా, జపాన్ లాంటి దేశాల్లో పుష్ప 2 ఇంకా రిలీజ్ కాలేదు. అక్కడ నెట్ ఫ్లిక్స్ ఉండదు కాబట్టి థియేటర్ విడుదల అయితే తప్ప చూడలేరు. త్వరలోనే ఈ ప్లానింగ్ చేసే ఆలోచనలో నిర్మాతలున్నట్టు సమాచారం.
పుష్ప 1 ది రైజ్ తో జాతీయ అవార్డు అందుకున్న బన్నీ పుష్ప 2 ది రూల్ తో ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ దక్కించుకున్నాడు. ఈ పాపులారిటీ త్వరలో ప్రారంభం కాబోయే త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్యాన్ ఇండియా మూవీకి చాలా ఉపయోగపడనుంది. మార్చిలో ఉగాది పండగ సందర్భంగా ప్రకటనా వచ్చే సూచనలున్నాయి.
This post was last modified on February 4, 2025 2:21 pm
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా..…