గేమ్ ఛేంజర్ ఫలితం గురించి మాట్లాడేందుకు ఏం లేదు కానీ అప్పుడప్పుడు వద్దన్నా దాని తాలూకు కంటెంట్ అభిమానులను గుచ్చుతూనే ఉంటుంది. నిన్న నానా హైరానా వీడియో సాంగ్ ని యూట్యూబ్ లో అఫీషియల్ గా రిలీజ్ చేశారు. జనవరి 10 సినిమా రిలీజైన మొదటి రోజు ఈ సాంగ్ లేకపోవడం ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచింది.
విడుదలకు ముందు దర్శకుడు శంకర్, తమన్ ఇద్దరూ దీని గురించి ఒక ఇంటర్వ్యూ వీడియో చేశారు. సాంగ్ మేకింగ్ అంటూ గాయనీ గాయకులతో కలిసి ఒక టీజర్ వదిలారు. ఇండియాలోనే మొదటిసారి ఇన్ఫ్రారెడ్ కెమెరా వాడినట్టు గొప్పగా చెప్పుకున్నారు.
తీరా చూస్తే థియేటర్లలో లేదు. మూడు రోజుల తర్వాత జోడించారు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అయిపోయింది. నెగటివ్ టాక్ విపరీతంగా పాకిపోవడంతో జనం పట్టించుకోలేదు. పాట బాగుందనే టాక్ ఉన్నా దాని ప్రభావం ఇనుమంతైనా కలెక్షన్ల మీద పడలేదు. కట్ చేస్తే నిన్న యూట్యూబ్ లో చూసిన ప్రతి ఒక్కరు ఇంత మంచి విజువల్స్ ని అనవసరంగా వృథా చేసుకున్నారనే కామెంట్స్ తో శంకర్ ని నిందిస్తున్నారు.
ఒకవేళ ప్లేస్ మెంట్ లేక ఎడిటింగ్ లో తీసేశారు అనుకుంటే అసలు స్క్రిప్ట్ లోనే గుర్తించాల్సింది కదాని నిలదీస్తున్నారు. దేవర దావూదీ రూట్ లో వెళ్లడం మిస్ ఫైర్ అయ్యిందని విమర్శిస్తున్నారు.
సరే జరిగిందేదో జరిగింది కానీ తక్కువ బడ్జెట్ లో ఇలాంటి పాట తీసే లేపేస్తే ఇబ్బంది ఉండదు కానీ ఇలా ఇంత గ్రాండ్ స్కేల్ లో షూట్ చేశాక తెరమీద కనిపించకపోతే పని చేసిన ప్రతి ఒక్కరికి బాధే. అన్నట్టు అమెజాన్ ప్రైమ్ లో గేమ్ ఛేంజర్ అతి త్వరలోనే స్ట్రీమింగ్ కు రానుంది. ఇవాళో రేపో ప్రకటన ఇవ్వబోతున్నారు.
భారీ మొత్తానికి హక్కులు సొంతం చేసుకున్న ప్రైమ్ బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉన్నా ఓటిటిలో మాత్రం భారీ వ్యూస్ తెచ్చుకుంటుందనే ఆశాభావంతో ఉంది. అయితే హెచ్డి లీక్ తో ఆల్రెడీ తీవ్రంగా నష్టపోయిన గేమ్ ఛేంజర్ డిజిటల్ లో ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. వచ్చే వారం రిలీజని టాక్.
This post was last modified on February 4, 2025 10:58 am
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…