Movie News

మూడు కొత్త సినిమాల కబుర్లు…

సోమవారం వసంత పంచమి. చాలా మంచి రోజు. ఈ శుభ సందర్భాన్ని కొత్త సినిమాల ఓపెనింగ్‌ కోసం టాలీవుడ్ బాగానే ఉపయోగించుకుంది. ఆసక్తికర కాంబినేషన్లలో ఈ రోజు రెండు సినిమాలు ప్రారంభోత్సవం జరుపుకున్నాయి. ముందు రోజు మరో సినిమా ఓపెనింగ్ జరిగింది. ఈ మూడు చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. ఈ మూడు చిత్రాల్లో స్పెషల్ మూవీ అంటే.. ‘ఆకాశంలో ఒక తార’నే.

మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్.. ఇలా తెలుగులో ముఖ్య పాత్రల్లో మూడు అద్భుతమైన సినిమాలు చేసిన దుల్కర్ సల్మాన్.. కొత్తగా ఇక్కడ హీరోగా నటిస్తున్న చిత్రమిది. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ తర్వాత అంచనాలను అందుకోలేకపోయిన యువ దర్శకుడు పవన్ సాధినేని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. స్వప్న సినిమాస్, గీతా ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో దుల్కర్ సరసన సాత్విక వీరవల్లి అనే కొత్తమ్మాయి కథానాయికగా నటించనుంది. త్వరలోనే ఈ చిత్ర తొలి షెడ్యూల్ మొదలు కానుంది.

గత ఏడాది ‘క’ మూవీతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం హీరోగా ఈ రోజు ఓ కొత్త చిత్రం మొదలైంది. దాని టైటిల్ ‘కే ర్యాంప్’ కావడం విశేషం. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన బూతు కలిసిన మాటను తన సినిమాకు టైటిల్‌గా పెట్టుకుని సాహసం చేస్తున్నాడు కిరణ్. ‘రంగబలి’లో కథానాయికగా నటించి, ఇటీవలే ‘మార్కో’ మూవీతో మలయాళంలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన యుక్తి తరేజా ఈ మూవీలో హీరోయిన్‌గా చేస్తోంది. హాస్య మూవీస్ బేనర్లో జైన్స్ నానీ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఇది ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ అని కిరణ్ చెబుతున్నాడు.

సోమవారం ఒక ఇంట్రెస్టింగ్ లేడీ ఓరియెంటెడ్ మూవీ కూడా శ్రీకారం చుట్టుకుంది. పెళ్లయ్యాక సినిమాలు చేయని వరుణ్ సతీమణి లావణ్య త్రిపాఠి బిగ్ స్క్రీన్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్న చిత్రం అది. ఈ సినిమాకు ‘సతీ లీలావతి’ లాంటి క్లాసిక్ టైటిల్ పెట్టడం విశేషం. సమంతకు జోడీగా ‘శాకుంతలం’లో నటించిన మలయాళ నటుడు దేవ్ మోహన్.. లావణ్యతో జత కట్టబోతున్నాడు.

భీమిలి కబడ్డీ జట్టు, శంకర చిత్రాలను రూపొందించిన తాతినేని సత్య ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో నాగమోహన్ బాబు అనే కొత్త నిర్మాత ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

This post was last modified on February 3, 2025 10:50 pm

Share

Recent Posts

యూపీఐ లో కొత్త షార్ట్‌కట్… స్కాన్ లేకుండానే పేమెంట్

షాప్‌లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…

46 minutes ago

రావిపూడి మార్కు మళ్ళీ మొదలయ్యింది

ఎవరు ఏమన్నా, ఎన్ని కామెంట్లు చేసినా దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. మొదటిది కమిట్…

2 hours ago

ఇరుముడి ఇన్నింగ్స్ ఇంకా ఉన్నాయా

మూడు వారాలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రేంజ్ లో వీరబాదుడు బాదిన ఇరుముడి కలెక్షన్లు క్లైమాక్స్ కు వచ్చాయేమోనని అనుకుంటే…

2 hours ago

ప్రభాస్ సినిమాల లెక్కలన్నీ తారుమారు

కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…

4 hours ago

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వెళ్లిందా?

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…

4 hours ago

జనసేనకు 50 నుంచి 60.. బొలిశెట్టి వారి లెక్క‌లు!

జ‌న‌సేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొంద‌రు నాయ‌కులు త‌మ పంథాను మార్చుకోవ‌డం లేదు.…

6 hours ago