ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పదవి చేపట్టాక విడుదలవుతున్న మొదటి సినిమా ఇప్పటికైతే హరిహర వీరమల్లునే. ఇందులో అనుమానం లేదు. అయితే గత రెండు వారాలుగా జరుగుతున్న పరిణామాలు, ఇతర చిన్నా పెద్ద పోటీ చిత్రాలు అదే మార్చి 28 వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకోవడాలు అనుమానాలను పెంచుతున్నాయి.
షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ ప్యాన్ ఇండియా మూవీలో పవన్ కు సంబంధించి అతి కొద్ది వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది. దానికోసమే ప్రత్యేకంగా అమరావతికి దగ్గరలో సెట్లు కూడా వేస్తున్నారు. కానీ అవి జాప్యం కావడం వల్ల డెడ్ లైన్ మీటవ్వడం అనుమానంగా ఉంది.
తాజాగా హరిహర వీరమల్లు కంటే ముందు ఓజి రిలీజవుతుందనే ప్రచారం ఊపందుకోవడం అభిమానులను అయోమయానికి గురి చేస్తోంది. నిజానికి బజ్ పరంగా పోల్చుకుంటే ఇలా చేయడమే కరెక్ట్. ఎందుకంటే ఓజి బ్లాక్ బస్టర్ అయితే దాని ప్రభావం చాలా సానుకూలంగా హైప్ తక్కువగా ఉన్న వీరమల్లుకు ప్లస్ అవుతుంది.
దాని వల్ల రెండు సినిమాలు లాభ పడతాయి. కానీ నిర్మాతలు నిర్ణయం తీసుకోవడం కాదు ముందైతే పవన్ డేట్లు దొరకాలి. కానీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు చక్కగానే ఉన్నప్పటికి పాలన పరంగా బిజీగా ఉండటం వల్ల పవన్ సినిమాల మీద పూర్తి ధ్యాస పెట్టలేకపోతున్న మాట వాస్తవం.
ఫిబ్రవరి వచ్చేసింది. అసలే ఈ నెలలో తక్కువ రోజులు. ఒకవేళ వీరమల్లు కనక మార్చిలోనే రావాలనుకుంటే ఇప్పటి నుంచే ప్రమోషన్లు మొదలుపెట్టాలి. పవన్ స్వయంగా పాడిన మాట వినాలి మరీ చార్ట్ బస్టర్ కాలేదు. పోస్టర్లు, గతంలో వచ్చిన టీజర్ తో అంతగా పనవ్వలేదు. కానీ ఓజి అలా లేదు.
ఊరికే తమన్ చిన్న అప్డేట్ ఇచ్చినా సోషల్ మీడియా ఊగిపోతోంది. ఒక్క పాట విడుదల చేసినా సునామిలా ఆన్ లైన్ ని ముంచెత్తడం ఖాయం. కానీ పవన్ కళ్యాణ్ సిగ్నల్ రాకపోవడం వల్ల డివివి దానయ్య ఇంకా పూర్తి స్థాయి ప్రమోషన్లు మొదలుపెట్టలేదు. అసలీ డిస్కషన్ కి శుభం కార్డు ఎప్పుడు పడుతుందో అంతు చిక్కడం లేదు.
This post was last modified on February 3, 2025 5:48 pm
అనుకున్నంతా అయ్యింది. అధికార పార్టీ టీడీపీ వ్యూహాల ముందు విపక్ష వైసీపీ వ్యూహాలు ఫలించలేదు. రాజకీయాలకు కొత్తే అయినా గుంటూరు…
పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం తినిపించడం ఈ రోజుల్లో పెద్ద సవాళుగా మారింది. తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, పిల్లలు తమ…
రాజకీయ సన్యాసం తీసుకున్న వైసీపీ మాజీ విజయసాయిరెడ్డికి సంబంధించిన రహస్యాలు ఒక్కొక్కటిగానే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వచ్చిన ఓ విషయం…
ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. కఠిన సమయంలో మ్యాచ్…
టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన ఆస్తుల పంచాయితీ సోమవారం మరో మలుపు…
భారతీయ రైల్వే తన ప్రయాణికుల కోసం అన్ని రకాల సేవలను ఒకే చోట అందించే కొత్త యాప్ను ప్రారంభించింది. ‘స్వరైల్…