తెలుగు దర్శకులు హిందీలో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. రాఘవేంద్రరావు, మురళీమోహనరావు లాంటి సీనియర్లు ఎప్పుడో బాలీవుడ్లో సినిమాలు తీశారు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ వెళ్లి హిందీ పరిశ్రమను ఒక ఊపు ఊపిన సంగతి తెలిసిందే. ఆయన తర్వాత కూడా పూరి జగన్నాథ్ లాంటి కొందరు డైరెక్టర్లు అక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలతో సందీప్ రెడ్డి వేసిన ఇంపాక్ట్ గురించి తెలిసిందే.
ఇక త్వరలోనే గోపీచంద్ మలినేని తొలి హిందీ చిత్రం విడుదల కాబోతోంది. సీనియర్ హీరోగా సన్నీ డియోల్ లీడ్ రోల్‌లో ఆయన రూపొందించిన ‘జాట్’ ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను నిర్మిస్తున్నది టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్సే కావడం విశేషం. ఆ సంస్థలోనే గోపీచంద్ ‘వీరసింహారెడ్డి’ తీశాడు. తర్వాత అతడికి బాలీవుడ్ ప్రాజెక్ట్ సెట్ చేసింది మైత్రీ సంస్థ. ఇప్పుడు మైత్రీ సంస్థ మరో దర్శకుడిని బాలీవుడ్‌కు తీసుకెళ్లే పనిలో ఉన్నట్లు సమాచారం.
గోపీతో ‘వీరసింహారెడ్డి’ చేస్తున్నపుడే.. బాబీ కొల్లితో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది మైత్రీ సంస్థ. రెండు చిత్రాలూ మంచి ఫలితాలందుకున్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత బాబీ.. ‘డాకు మహారాజ్’ చేశాడు. అదీ సక్సెస్ అయింది. ఇప్పుడు బాబీని హిందీకి తీసుకెళ్లే ప్రయత్నంలో మైత్రీ సంస్థ ఉందట. అతడితో ఇందుకోసం ఒక స్క్రిప్టు రెడీ చేయిస్తోందట.
ఆ పని పూర్తయ్యాక ఆ కథకు తగ్గ హీరోతో బాలీవుడ్లో మరో భారీ చిత్రం చేయాలని మైత్రీ సంస్థ చూస్తోంది. బాబీకి వెంటనే తెలుగులో అయితే ఏ కమిట్మెంట్ లేదని తెలుస్తోంది. ఉన్నా.. దాన్ని వాయిదా వేయించి హిందీ సినిమానే చేయించబోతోందట మైత్రీ సంస్థ. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రావచ్చని తెలుస్తోంది. ‘డాకు మహారాజ్’ రిలీజ్ తర్వాత కొంచెం బ్రేక్ తీసుకున్న బాబీ.. ప్రస్తుతం తన రైటింగ్ టీంతో కలిసి స్క్రిప్టు పనిలో ఉన్నట్లు సమాచారం.
This post was last modified on February 3, 2025 4:40 pm
పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం తినిపించడం ఈ రోజుల్లో పెద్ద సవాళుగా మారింది. తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, పిల్లలు తమ…
రాజకీయ సన్యాసం తీసుకున్న వైసీపీ మాజీ విజయసాయిరెడ్డికి సంబంధించిన రహస్యాలు ఒక్కొక్కటిగానే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వచ్చిన ఓ విషయం…
ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. కఠిన సమయంలో మ్యాచ్…
టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన ఆస్తుల పంచాయితీ సోమవారం మరో మలుపు…
భారతీయ రైల్వే తన ప్రయాణికుల కోసం అన్ని రకాల సేవలను ఒకే చోట అందించే కొత్త యాప్ను ప్రారంభించింది. ‘స్వరైల్…
అక్కినేని నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక అంచనాల మధ్య విడుదల కాబోతోంది ‘తండేల్’ మూవీ. తన చివరి చిత్రాలు కస్టడీ, థాంక్యూ…