తమిళంలో చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది ఐశ్వర్యా రాజేష్. కెరీర్ ఆరంభంలోనే ఆమె ఇద్దరు పిల్లల తల్లిగా డీగ్లామరస్ రోల్ చేసింది ‘కాకా ముట్టై’లో. ఆ చిత్రానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత కూడా ఇలాంటి పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్సే చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోందామె.
ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘కనా’ సూపర్ హిట్టయింది తమిళంలో. దీన్నే తెలుగులో ‘కౌసల్యా కృష్ణమూర్తి’ పేరుతో రీమేక్ చేశారు. కానీ అదిక్కడ ఏమాత్రం ఆడలేదు. ఇదే కాక ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో ఓ కీలక పాత్ర చేసింది ఐశ్వర్య. ఆమె వరకు అదరగొట్టినా ఈ సినిమా కూడా సరిగా ఆడకపోవడంతో ఐశ్వర్యకు మాతృభాషలో కెరీర్ ముందుకు సాగలేదు. అయినప్పటికీ ఆమె పోరాటం ఆపట్లేదు.
ఐశ్వర్య తమిళంలో నటిస్తున్న కొత్త చిత్రాన్ని తెలుగులో కూడా ఒకేసారి రూపొందిస్తున్నారు. ఆ సినిమా పేరు.. భూమిక. ఇది ఐశ్వర్యకు ల్యాండ్ మార్క్ ఫిలిం కావడం విశేషం. ఇది ఆమె 25వ సినిమా. రతీంద్రన్ ప్రసాద్ అనే దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ లాంటి టాప్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను కూడా లాంచ్ చేశారు. దట్టమైన అడవిలో పచ్చని చెట్ల నుంచే పుట్టుకొచ్చిన రూపంతో ఐశ్వర్య రూపం ఆసక్తి రేకెత్తిస్తోంది.
తమిళంలో మనమ్మాయిని నమ్మి ఇలా వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు నిర్మిస్తున్నారంటే గొప్ప విషయమే. ఇంతకుముందు అంజలికి ఇలాంటి ఇమేజ్ వచ్చిందక్కడ. స్వాతి, శ్రీ దివ్య, ఆనంది లాంటి తెలుగమ్మాయిలు అక్కడ సత్తా చాటారు. ఇప్పుడు రీతూ వర్మ కూడా మంచి పేరు సంపాదిస్తోంది. ఐతే నటిగా ఐశ్వర్యకు వచ్చిన పేరు మాత్రం ఇంకెవరికీ రాలేదనే చెప్పాలి. మరి ఈ సినిమాతో కోలీవుడ్లో ఐశ్వర్య ఎలాంటి ముద్ర వేస్తుందో.. తెలుగులో ఏమేర ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.
This post was last modified on October 20, 2020 8:41 am
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…