అరవింద సమేత.. మహర్షి.. గద్దలకొండ గణేష్.. అల వైకుంఠపురములో… ఇలా ఒక టైంలో తెలుగులో వరుస సక్సెస్‌లతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది బాలీవుడ్ భామ పూజా హెగ్డే. పెద్ద సినిమాల్లో కథానాయికగా ఆమె ఫస్ట్ ఛాయిస్‌గా కనిపించేది. కానీ ఉన్నట్లుండి ఆమె కెరీర్లో డౌన్ ఫాల్ మొదలైంది. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య.. ఇలా వరుసగా ఫెయిల్యూర్లు పలకరించాయి.
సక్సెస్‌లో ఉన్నపుడు ఇండస్ట్రీ జనాలు ఎలా నెత్తిన పెట్టుకుంటారో.. వరుసగా ఫెయిల్యూర్లు ఎదురైతే అంత లైట్ తీసుకుంటారు. ఓవైపు ఫ్లాపులు.. మరోవైపు ‘గుంటూరు కారం’ సినిమా నుంచి వైదొలగడం పూజాకు ప్రతికూలంగా మారాయి. ఉన్నట్లుండి ఆమెకు అవకాశాలు ఆగిపోయాయి. వేరే భాషల్లో అవకాశాలు వస్తున్నా.. అక్కడ కూడా ఫెయిల్యూర్లు ఆగట్లేదు. బాలీవుడ్లో ఆమె నటించిన సర్కస్, కిసీ కా భాయ్ కిసి కి జాన్ కూడా డిజాస్టర్లే అయ్యాయి.
ఇప్పుడు ఆమె ఆశలన్నీ మరో హిందీ చిత్రం ‘దేవా’ మీద నిలిచాయి. షాహిద్ కపూర్ సరసన మలయాళ డైరెక్టర్ రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో పూజా నటించిన సినిమా ఇది. గత వీకెండ్లో మంచి అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తెలుగులో ‘హంట్’గా రీమేక్ అయిన పుష్కర కాలం నాటి మలయాళ చిత్రం ‘ముంబయి పోలీస్’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మాతృకతో పోలిస్తే చాలా మార్పులు చేసినా ఫలితం లేకపోయింది.
సినిమాకు సరైన ఓపెనింగ్స్ కూడా రాలేదు. వీకెండ్లోనే సినిమా డిజాస్టర్ అని తేలిపోయింది. సోమవారం నుంచి వసూళ్లను పెద్దగా కన్సిడర్ చేసే పరిస్థితి కూడా ఉండేలా లేదు. దీంతో పూజ ఖాతాలో మరో డిజాస్టర్ జమ అయినట్లే అని తేలిపోయింది. వరుసగా ఇన్ని ఫెయిల్యూర్లు వస్తే ఏ హీరోయిన్‌కైనా కష్టమే. ప్రస్తుతం ఆమె తమిళంలో రెట్రో, జననాయగన్ సినిమాల్లో నటిస్తోంది. మరి ఆ చిత్రాలైనా తన రాతను మారుస్తాయేమో చూడాలి.
This post was last modified on February 3, 2025 1:56 pm
తెలంగాణలో ఉప ఎన్నికలు జరగనున్నాయా? ఈ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రకటన ఏమైనా వచ్చిందా? అలాంటిదేమీ లేకున్నా..…
కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు చిక్కిన కచిడి చేప అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 25 కిలోల బరువున్న ఈ చేప మార్కెట్లో…
ఫిబ్రవరి ఏడు కోసం అక్కినేని అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. గత కొంత కాలంగా గట్టిగా చెప్పుకునే బ్లాక్…
భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.…
1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…
ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి, కేవలం 37…