ఒక్కోసారి ఛాయాచిత్రాలు పెద్ద కథలు చెబుతాయి. నిన్న సందీప్ రెడ్డి వంగా అలాంటి చర్చకే చోటిచ్చారు. తన ఆఫీస్ తాలూకు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశాక దాని మీద అభిమానుల్లో చర్చ జరిగింది. బోలెడు ఇంగ్లీష్ సినిమా పోస్టర్లు ఉన్నప్పటికీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది మాత్రం చిరంజీవి కోపంతో ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ పిక్.
ఇందులో చాలా విశేషాలున్నాయి. 1987లో ఆరాధన వచ్చింది. సుహాసిని హీరోయిన్, దర్శకుడు భారతీరాజా. తమిళ సూపర్ హిట్ కడలోర కవితైగల్ రీమేక్. అక్కడ బాగా ఆడినా తెలుగులో డిజాస్టరయ్యింది. ఇళయరాజా పాటలు ఆడియో పరంగా ఛార్ట్ బస్టరే కానీ మెగా ఫ్లాప్ ని కాపాడలేకపోయాయి.
చిరు బ్లాక్ బస్టర్స్ బోలెడు ఉండగా సందీప్ వంగా దీని ఫోటోనే ఎందుకు పెట్టుకున్నాడనే సందేహం రావడం సహజం. అదెలాగో చూద్దాం. ఆరాధనలో చిరంజీవి పాత్ర పేరు పులిరాజు. పొగరు, కోపం అణువణువు నిండిపోయి ఉంటాయి. ఇతని ప్రవర్తన ఏ స్థాయిలో ఉంటుందంటే కన్నతల్లిని సైతం తూలనాడేంత.
అలాంటి వ్యక్తి జీవితంలో జెన్నిఫర్ అనే టీచర్ వస్తుంది. పులిరాజు క్షణికంలో చేసిన తప్పుకు చాచి చెంప మీద కొడుతుంది. ఆ సందర్భంలో ఆగ్రహంతో రగిలిపోయే చిరు ఇచ్చే హావభావమే సందీప్ వంగ పెట్టిన ఫోటో. కేవలం ఒక్క సెకండ్ మాత్రమే కనిపించే ఎక్స్ ప్రెషన్ ని అలా ఫ్రేమ్ గా పెట్టుకున్నాడు.
సందీప్ వంగా హీరోలు సౌమ్యంగా ఉండరు. అర్జున్ రెడ్డి, యానిమల్ లో అదే ఋజువయ్యింది. పులిరాజు కూడా అదే బాపతు. సినిమా ఆడకపోయినా ఆ క్యారెక్టరైజేషన్, మెగాస్టార్ నటన వంగాను మైమరిచిపోయేలా చేశాయి. తనకు ఇష్టమైన మాస్టర్ సినిమా సీన్ లో చిరు ఏ చొక్కా వేసుకున్నాడో దాని రంగుతో సహా గుర్తు పెట్టుకున్న వైనం ఇంటర్వ్యూ రూపంలో వైరలయ్యింది.
ఇంతగా ఇష్టపడే సందీప్ వంగా నిజంగా చిరంజీవితో ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టమే. స్పిరిట్ స్క్రిప్ట్ పూర్తి చేసుకుని ప్రభాస్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్న సందీప్ వంగా ఎంత లేదన్నా ఒక రెండేళ్లు దానికే అంకితం కాబోతున్నాడు.
This post was last modified on February 3, 2025 2:33 pm
తెలంగాణలో ఉప ఎన్నికలు జరగనున్నాయా? ఈ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రకటన ఏమైనా వచ్చిందా? అలాంటిదేమీ లేకున్నా..…
కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు చిక్కిన కచిడి చేప అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 25 కిలోల బరువున్న ఈ చేప మార్కెట్లో…
ఫిబ్రవరి ఏడు కోసం అక్కినేని అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. గత కొంత కాలంగా గట్టిగా చెప్పుకునే బ్లాక్…
అరవింద సమేత.. మహర్షి.. గద్దలకొండ గణేష్.. అల వైకుంఠపురములో... ఇలా ఒక టైంలో తెలుగులో వరుస సక్సెస్‌లతో తిరుగులేని క్రేజ్…
భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.…
1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…