తమిళనాట సినిమాలతో పాటు సినిమాయేతర విషయాలతోనూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే అమ్మాయి వరలక్ష్మి శరత్ కుమార్. సీనియర్ నటుడు శరత్ కుమార్ తనయురాలైన ఈ భామ.. మొదట్లో కథానాయికగా నటించిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. ఆ సమయంలోనే విశాల్‌తో ప్రేమాయణం నడుపుతున్నట్లుగా ఈమె వార్తల్లో నిలిచింది.
వివాదాస్పద అంశాలపై చాలా బోల్డ్‌గా మాట్లాడే అలవాటున్న వరలక్ష్మి ఒక సమయంలో విశాల్‌తో సన్నిహితంగానే మెలిగింది. అతడిని పెళ్లాడబోతున్నట్లే కనిపించింది. కానీ తర్వాత అతడికి దూరమైంది. సినిమాల మీదే ఫోకస్ పెట్టింది. కథానాయిక పాత్రలు కలిసి రాకపోవడంతో ఆమె విలన్, క్యారెక్టర్ రోల్స్ వైపు మళ్లింది. అవి బాగానే వర్కవుటయ్యాయి. విజయ్ నటించిన సర్కార్ లాంటి భారీ చిత్రంలో ఆమె విలన్ పాత్ర పోషించడం విశేషం.
తెలుగులో కూడా తెనాలి రామకృష్ణ సహా కొన్ని సినిమాల్లో నటించిన వరలక్ష్మి ఇప్పుడు కొత్త అవతారం ఎత్తింది. ఆమె దర్శకురాలిగా మారింది. కన్నామూచ్చి (దాగుడుమూతలు అని అర్థం) అనే టైటిల్‌తో వరలక్ష్మి దర్శకురాలిగా అరంగేట్రం చేయనుంది. ఈ సినిమా ప్రి లుక్ పోస్టర్ ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. పోస్టర్ చూస్తే ఇదో థ్రిల్లర్ తరహా సినిమా అనిపిస్తోంది. ఈ చిత్ర ప్రి లుక్ పోస్టర్‌ను మన మంచు లక్ష్మీప్రసన్న లాంచ్ చేయడం విశేషం.
తమిళంలో భారీ చిత్రాల నిర్మాణ సంస్థ అయిన తెండ్రాల్ ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మించనుంది. సామ్ సీఎస్ సంగీతం సమకూర్చనున్నాడు. ఇందులో ప్రధాన పాత్రలు పోషించనున్న నటీనటులెవరన్నది వెల్లడి కాలేదు. వరలక్ష్మి ఇలా దర్శకురాలిగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. మరి కొత్త అవతారంలో ఆమె ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి.
This post was last modified on October 20, 2020 8:32 am
నిజమే. కేవలం రూ.500 లను పెట్టుబడిగా పెట్టిన ఆ ట్రక్కు డ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇదేదో ఎక్కడో…
పెట్టుబడులను రాబట్టేందుకు ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లిన తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి రెండో రోజే ఫలితం రాబట్టారు.…
ఏపీలో అధికార కూటమిలో కీలక పార్టీగా ఉన్న జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని రాజకీయా…
2023 సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన వీరసింహారెడ్డి దర్శకుడు గోపీచంద్ మలినేని మరోసారి బాలకృష్ణతో చేతులు కలపబోతున్నారు. త్వరలో…
గత ఏడాది రాజకీయాల కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రేక్ తీసుకున్న టైంలో ఆయన చేతిలో మూడు చిత్రాలున్నాయి.…
టెక్నాలజీ రంగంలో తెలుగు ప్రజలు ఇప్పుడు విశ్వవ్యాప్తంగా సత్తా చాటుతున్నారు. ఐటీలో మేటి సంస్థలు మైక్రోసాఫ్ట్, గూగుల్ లకు భారతీయులు……