ఒకప్పుడు అంటే పాతిక ముప్పై సంవత్సరాల క్రితం ప్రేక్షకులు పాటలు వినాలంటే ఆడియో క్యాసెట్లు ఎక్కువగా చెలామణిలో ఉండేవి. అంతకు ముందు గ్రామ్ ఫోన్ రికార్డులు వాడేవాళ్లు. థియేటర్లో మళ్ళీ మళ్ళీ సినిమాలు చూసే అవకాశం లేని వాళ్ళు కనీసం డైలాగులైనా విందామనే ఉద్దేశంతో కేవలం సంభాషణలు మాత్రమే ఉండే క్యాసెట్లను కొనేవాళ్ళు.
వీటిలో పాటలు ఉండవు. దానవీరశూరకర్ణ, షోలే, అడవిరాముడు లాంటివి వీటి అమ్మకాల్లో రికార్డులు సృష్టించేవి. 2000 సంవత్సరం ఆపై మూడు నాలుగేళ్ల దాకా ఇవి వస్తూనే ఉన్నాయి. తర్వాత టెక్నాలజీ పెరిగాక ఇవి ఆగిపోయాయి. ఎంపి3 హవా కొంత కాలం నడిచింది.
ఇప్పుడు యూట్యూబ్, స్పాటిఫై, జియో సవాన్, యాపిల్ ట్యూన్స్ తదితరాల ప్రపంచం. అంతా డిజిటలే. ఓటిటిలు వచ్చాక ఏ సినిమా అయినా నేరుగా ఎన్నిసార్లయినా చూసే వెసులుబాటు రావడంతో క్రమంగా డైలాగులను ఆడియో రూపంలో ఇచ్చే ట్రెండ్ కనుమరుగైపోయింది.
ఓన్లీ సాంగ్స్ ధోరణికి ఆడియన్స్ అలవాటు పడ్డారు. ఇప్పుడు పుష్ప 2 ది రూల్ దాన్ని మార్చే పనిలో పడింది. పాటలు లేకుండా ముఖ్యమైన ఎపిసోడ్స్ కు సంబంధించిన డైలాగులను జూక్ బాక్స్ పేరుతో ఆడియో మాత్రమే యూట్యూబ్ లో స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. అంటే కేవలం వినగలం తప్ప చూడలేం.
ఇది కనక వర్కౌట్ అయితే మరిన్ని సినిమాలు ఇదే దారిలో వెళ్తాయి. కాకపోతే కంటెంట్ లో మళ్ళీ వినాలనిపించే స్థాయిలో మాటలు ఉండాలి. అప్పుడే ఆదరణ దక్కుతుంది. పుష్ప 2లో ఇవి బోలెడు. రావు రమేష్ ని అల్లు అర్జున్ సిఎం అయిపోమని చెప్పడం, భర్త గొప్పదనం గురించి శ్రీవల్లి వివరించే సన్నివేశం, దుబాయ్ సేటుతో పుష్పరాజ్ చేసే ఎర్ర చందనం డీల్ లాంటివి జస్ట్ వినేందుకు కూడా బాగుంటాయి.
అయినా రిలీజైన రెండు నెలల తర్వాత కూడా ఏదో ఒక రూపంలో పుష్ప 2 సౌండ్ చేస్తూనే ఉంది. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చేసిన బన్నీ బ్లాక్ బస్టర్ అందులో కూడా రికార్డుల దిశగా పరుగులు పెడుతోంది.
This post was last modified on February 2, 2025 3:47 pm
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…