యుఎస్‌లో డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్షుడు కావడం ఆలస్యం.. చదువు, వృత్తి కోసం తమ దేశానికి వచ్చే విదేశీయుల విషయంలో కఠిన నిబంధనలు, సంస్కరణల దిశగా అడుగులు వేశారు. యుఎస్‌లో పుట్టే విదేశీయుల పిల్లలకు పౌరసత్వం ఇవ్వకుండా ఆయన ప్రతిపాదించిన చట్టానికి కోర్టులో తాత్కాలికంగా బ్రేక్ పడినా.. దాన్ని ఎలాగైనా అమలు చేయాలనే పట్టుదలతో ఉన్నాడు ట్రంప్. మరోవైపు చదువు కోసం వచ్చి పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకునే విదేశీయుల పట్ల ట్రంప్ సర్కారు ఉక్కుపాదం మోపడానికి సిద్ధమైంది.
పెద్ద ఎత్తున రైడ్స్ జరుగుతున్నాయి. అక్రమంగా పని చేస్తున్న వాళ్లను వాళ్ల వాళ్ల దేశాలకు పంపించేస్తున్నారు. వాళ్లతో పని చేయించుకుంటున్న వాళ్లపై ఫైన్స్ వేస్తున్నారు. ఈ పరిణామం యుఎస్‌లో చదువు కోసం వెళ్లిన లక్షలమంది భారతీయుల్లో తీవ్ర ఆందోళనకు దారి తీస్తోంది. ఇన్నాళ్లూ ఖర్చులకు ఇబ్బంది లేకుండా ఉన్న భారత యువత.. ఇప్పుడు తమ ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ట్రంప్ సర్కారు ఇదే కఠిన వైఖరి అవలంభిస్తే ఇండియన్ యూత్‌కు తీవ్ర ఇబ్బందులు తప్పవు.
డబ్బులకు కటకటలాడాల్సిందే. ఈ ప్రభావం తెలుగు వాళ్లు నిర్వహించే వ్యాపారాల మీదే కాక తెలుగు సినిమాల మీద కూడా గట్టిగానే పడుతుందని అంచనా. ఇకపై ఎంత రేటుపెట్టినా ప్రిమియర్ షోల టికెట్లను ఎగబడి కొనే పరిస్థితి ఉండదు. మొత్తంగా తెలుగు సినిమాల ఆక్యుపెన్సీలు పడిపోతాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త సినిమాలను కొనే విషయంలో డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.
రేట్ల విషయంలో ముందు వెనక ఆలోచిస్తున్నాయి. వచ్చే కొన్ని నెలల్లో రానున్న సినిమాలకు వచ్చే స్పందనను బట్టి తర్వాతి చిత్రాలపై నిర్ణయం తీసుకోనున్నారు. రాబోయే రోజుల్లో వసూళ్లు తగ్గితే.. బిజినెస్ మీద కచ్చితంగా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఏదైనా ట్రంప్ సర్కారు వైఖరి మున్ముందు ఎలా ఉండబోతోందన్నది కీలకంగా మారింది.
This post was last modified on February 2, 2025 1:49 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…