Movie News

పూరి తమ్ముడిది పెద్ద ధైర్యమే

కొత్త ఏడాదిలో రెండో నెల వచ్చేసింది. సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు వచ్చిన తర్వాత బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ సౌండ్ లేదు. ఒక్క వెంకటేష్ మాత్రమే మూడు వందల కోట్లతో నాన్ స్టాప్ బ్యాటింగ్ చేస్తుండగా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న బాలకృష్ణ ఫైనల్ రన్ కు దగ్గర్లో ఉన్నారు. ఇక తర్వాత వచ్చినవేవి కనీస ప్రభావం చూపించలేకపోయాయి.

ఈ నేపథ్యంలో అందరి కళ్ళు నాగచైతన్య తండేల్ మీదకు వెళ్తున్నాయి. గీతా ఆర్ట్స్ నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కావడంతో పోటీకి ఎవరూ రిస్క్ చేయలేదు. కానీ పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ ఫిబ్రవరి 7నే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధపడుతున్నాడు.

ఇది ఒక రకంగా చాలా పెద్ద ధైర్యం. ఎందుకంటే సాయిరామ్ శంకర్ సోలో హీరోగా మార్కెట్ ని ఎప్పుడో కోల్పోయాడు. ఒకరకంగా చెప్పాలంటే ఆడియన్స్ తనని మర్చిపోయారు. ఒకప్పుడు బంపర్ ఆఫర్ లాంటి హిట్లున్నా వాటిని కెరీర్ ఎదుగుదలకు మలుచుకోవడంలో విఫలమయ్యాడు. ఇప్పుడు రిలీజవుతున్న ఒక పధకం ప్రకారం క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో రూపొందింది.

ఇంటర్వెల్ లో హంతకుడు ఎవరో కనిపెట్టగలిగితే ప్రతి థియేటర్ లో ఒక లక్కీ విజేతకు పది వేల రూపాయలు గిఫ్ట్ ఇస్తామని ప్రకటించడం ఎంతమేరకు వర్కౌట్ అవుతుందో చెప్పలేం. బజ్ పరంగా పెద్దగా పనవుతున్నట్టు కనిపించడం లేదు.

పైగా ఒక రోజు ముందు అజిత్ పట్టుదల కూడా రిలీజవుతోంది. ఇదేమి కాంపిటీషన్ కాకపోయినా ఒక పధకం ప్రకారంకు హైప్ అయితే లేదనేది వాస్తవం. సో టాక్ రావడం చాలా కీలకం. వచ్చే వారం ఫిబ్రవరి 14న మరో మూడు సినిమాలు వస్తున్నాయి. ఆలోగానే సాయి రామ్ శంకర్ వీలైనంత రాబట్టుకుని సేఫ్ అయిపోవాలి.

దర్శకుడిగా తన పట్టు కోల్పోయిన పూరి జగన్నాథ్ ఆ మధ్య డబుల్ ఇస్మార్ట్ తో ఎలాంటి ఫలితం అందుకున్నారో చూశాం. ఆకాష్ పూరి సైతం కనీస హిట్ లేక స్ట్రగుల్ అవుతున్నాడు. ఇప్పుడు కాస్త ఊరట దక్కేలా సాయిరామ్ శంకర్ ఏమైనా మేజిక్ చేస్తాడో లేక పాత రూట్ లో వెళ్తాడో చూడాలి.

This post was last modified on February 1, 2025 8:28 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

గజిని 2: అరవింద్ అన్నారు కానీ… నిజంగా జరిగే పనేనా?

ఇరవై సంవత్సరాల క్రితం వచ్చిన గజిని మూవీ లవర్స్ మర్చిపోలేని ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్. సూర్య కెరీర్ ని…

12 minutes ago

ఒక్కొక్కటిగా కాదు… మూడింటిని ముడేసి

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిజంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సందర్భంగా కూటమి ఇచ్చిన సూపర్…

39 minutes ago

దిల్ రుబా మనసు మార్చుకుంటుందా?

వరస ఫ్లాపులతో సతమవుతున్నప్పుడు యూత్ హీరో కిరణ్ అబ్బవరంకు 'క' ఇచ్చిన బ్లాక్ బస్టర్ సక్సెస్ ఒక్కసారిగా మార్కెట్ ని…

1 hour ago

లోకేశ్ గారూ… సరిరారు మీకెవ్వరూ!

రాజకీయాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ నవ శకానికి నాందీ పలికారు. నిన్నటిదాకా రాజకీయం…

2 hours ago

పెద్దిరెడ్డి ఇలాకాలోకి జనసేన ఎంట్రీ!

ఏపీలో రాజకీయం అంతకంతకూ రసవత్తరంగా మారుతోంది. మొన్నటి ఎన్నికల్లో అందరి అంచనాలు తలకిందులు కాగా… ఆ విస్తుగొలిపే ఫలితాలకు అనుగుణంగానే…

2 hours ago

జగన్ గడపలో టీడీపీ మహానాడు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని మహానాడు…

7 hours ago