మంచు లక్ష్మీ ప్రసన్న తెలుగు యాస గురించి ఇప్పటిదాకా ఏ స్థాయిలో ట్రోలింగ్ జరిగిందో అందరికీ తెలుసు. దీన్ని లక్ష్మితో పాటు మంచు కుటుంబ సభ్యులు కూడా జీర్ణించుకుని స్పోర్టివ్‌గా తీసుకోవడం మొదలుపెట్టారు. తన వాయిస్‌ను ఇమిటేట్ చేస్తూ పెట్టే స్పూఫ్ వీడియోల్ని మంచు లక్ష్మినే సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.
ఇంత స్పోర్టివ్‌గా ఉండే మంచు లక్ష్మికి తాజాగా ఓ నెటిజన్ కోపం తెప్పించాడు. తన భాష విషయంలో లోపాన్ని ఎత్తి చూపించినందుకు ఆమె కోపం తెచ్చుకుంది. బుధవారం ఉదయం మంచు లక్ష్మి రెండు జడలు వేసుకుని మల్లెపూలు పెట్టుకుని తీయించుకున్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేసింది. అందులో లక్ష్మి తల్లి నిర్మలా దేవి కూడా ఉంది. దీనికి.. Amma, maali puvulu petindhi. Flowers from our garden! అని వ్యాఖ్య జోడించింది లక్ష్మి.
ఐతే ఈ మెసేజ్‌లో మల్లి స్పెలింగ్ తప్పుగా ఉండటంతో ఓ నెటిజన్ దాన్ని సరి చేసే ప్రయత్నం చేశాడు. అది maali కాదు malli అని ఆమెకు కొంచెం సెటైరిగ్గా చెప్పాడు. దీంతో లక్ష్మికి కోపం వచ్చింది. పోబే అంటూ అతణ్ని తిట్టింది. దీనికతను పోవే అంటూ రిప్లై ఇచ్చాడు. ఐతే ఈ కాన్వర్జేషన్ జరిగింది ఉదయం కాగా.. రాత్రికి లక్ష్మి కొంచెం శాంతించింది.
మల్లెపువ్వుల ఫొటో షేర్ చేసిన లక్ష్మీ ప్రసన్న.. మల్లెపువ్వుకు రకరకాల స్పెల్లింగ్స్ ఉన్నాయని.. అయినా తాను పెట్టిన ఫొటోలు ఆస్వాదించకుండా స్పెల్లింగ్స్ గురించి డిస్కషన్ ఏంటని ప్రశ్నించింది. తాను స్కూల్లో లాంగ్వేజ్ సరిగా చదువుకోలేదని.. తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటానికి తన టింగ్లిష్ లేదా ఇంగ్లిష్ ఏమాత్రం కారణం కాదని నమ్ముతానని ఆమె వ్యాఖ్యానించింది. ఇలా ఈ మల్లెపువ్వు గొడవకు తెరదించింది మంచువారి అమ్మాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates