ఇటీవలి కాలంలో సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్ ఏదైనా ఉందంటే ముందుగా చెప్పుకోవాల్సింది మార్కోనే. నిన్నటి దాక టయర్ 2, 3 విభాగంలో ఊగుతున్న హీరో ఉన్ని ముకుందన్ ని ఒక్కసారిగా స్టార్ గా మార్చిన ఘనత దీనికే దక్కుతుంది. విపరీతమైన హింస ఉన్నప్పటికీ ప్రేక్షకులు మార్కోని ఆదరించిన తీరు విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది.
తెలుగులో పెద్దగా ఆడలేదు కానీ మలయాళం, హిందీలో భారీ కలెక్షన్లు రాబట్టింది. ముఖ్యంగా బాలీవుడ్ వెర్షన్ మొదటి రోజు కేవలం లక్ష రూపాయలతో మొదలై జనవరి 1న కోటి రూపాయలు దాకా వసూలు చేయడం చిన్న విషయం కాదు. ఇదంతా జరిగి నెల దాటేసింది.
కానీ మార్కో పరిణామాలు వేరే కోణంలో కూడా ఉన్నాయి. మచ్చుకు ఒకటి చూద్దాం. ముంబై గ్రాండ్ రోడ్ లో ఉన్న నిశాంత్ థియేటర్ లో మార్కో రిలీజయ్యింది . దాని యజమాని పహ్లాజ్ నిహలాని. ఈయన ఒకప్పటి సెన్సార్ బోర్డు సభ్యుడు. సాధారణంగా ఈ హాలుకు మాస్ జనాలు ఎక్కువగా వస్తారు.
మొన్నెప్పుడో మార్కో వేసుకున్నారు. ఇందులో ఉన్న భీభత్సమైన వయొలెన్స్ కి జడుసుకున్న ప్రేక్షకులు ఇలాంటివి ఎందుకు ప్రదర్శిస్తున్నారని మేనేజర్ ని నిలదీశారు. అంతే కాదు ప్రీ క్లైమాక్స్ లో వచ్చే మర్డర్ సీన్లకు గట్టిగా కేకలు పెడుతున్న వైనం గమనించి వెంటనే మార్కోని ఆ థియేటర్ నుంచి తీసేశారు.
ఇదంతా పహ్లాజ్ నిహ్లానీ స్వయంగా చెప్పుకొచ్చారు. చిన్నపిల్లలు జడుసుకునే ఇలాంటి కంటెంట్ కి ఏ సర్టిఫికెట్ ఇచ్చేసి చేతులు దులుపుకోవడం సరికాదని, యానిమల్ బ్లాక్ బస్టర్ కావడంలో హింసతో పాటు క్యాస్టింట్, హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్ దోహదం చేశాయని, దాని స్ఫూర్తితో మార్కో లాంటివి రావడాన్ని ఆయన ఆక్షేపించారు.
అయినా ఆడియన్స్ కంప్లయింట్ ఇచ్చారని ఒక సినిమాని తీసేయడం చాలా అరుదు. విమర్శల సంగతి పక్కనపెడితే త్వరలో మార్కో 2కి రంగం సిద్ధమవుతోంది. మొదటి భాగంలోనే అంత రచ్చ చూపిస్తే ఇక సీక్వెల్ ఏ స్థాయిలో అరాచకం చేస్తారో ఊహించుకోవడం కష్టమే.
This post was last modified on January 31, 2025 2:20 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…