ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో వెలిగిపోతున్న సౌత్ హీరోయిన్ ఎవరు అంటే.. మరో మాట లేకుండా రష్మిక మందన్నా పేరు చెప్పేయొచ్చు. కొన్నేళ్ల నుంచి నేషనల్ లెవెల్లో తన దూకుడు మామూలుగా లేదు. 2023 చివర్లో ‘యానిమల్’ మూవీతో ఆమె పేరు మార్మోగింది. ఏడాది తర్వాత ‘పుష్ప-2’తో మరో భారీ పాన్ ఇండియా హిట్ కొట్టింది రష్మిక. త్వరలోనే ‘చావా’ లాంటి మరో పెద్ద బాలీవుడ్ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతోంది ఈ బెంగళూరు బ్యూటీ.
ఈ సినిమా వచ్చిన నెలన్నరకే మరో భారీ హిందీ చిత్రంతో రష్మిక భారతీయ ప్రేక్షకులను పలకరించబోతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు మురుగదాస్ రూపొందిస్తున్న ‘సికందర్’ మూవీలో ఆమే హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రంజాన్ కానుకగా మార్చి 28న రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం పని చేస్తూ రష్మిక టాలెంట్ చూసి సల్మాన్ ఫిదా అయిపోయాడట.
రష్మిక పనితీరు నచ్చి తన తర్వాతి చిత్రానికి కూడా తననే కథానాయికగా సూచించాడట సల్మాన్ ఖాన్. ‘సికందర్’ తర్వాత మరో తమిళ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు కండల వీరుడు. ఆ దర్శకుడు ఎవరో కాదు.. వరుసగా బ్లాక్ బస్టర్లు కొడుతున్న అట్లీ. ‘జవాన్’తో బాలీవుడ్ డెబ్యూలోనే వెయ్యి కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టిన అట్లీ.. తన తర్వాతి చిత్రాన్ని సల్మాన్ ఖాన్, రజినీకాంత్‌ల కాంబినేషన్లో మల్టీస్టారర్‌గా రూపొందించనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో కథానాయికగా రష్మిక కన్ఫమ్ అయినట్లు సమాచారం. ఈ ఛాయిస్ సల్మాన్‌దే అని సమాచారం. సల్మాన్, రజినీ కాంబినేషన్ అంటే.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అది పెద్ద మల్టీస్టారర్లలో ఒకటిగా ఇది నిలుస్తుందనడంలో సందేహం లేదు. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది. ఈ ఏడాది ద్వితీయార్దంలో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లొచ్చు.
This post was last modified on January 31, 2025 12:34 pm
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…