పరిశ్రమ, ప్రభుత్వాలు మేలుకోవాల్సిన టైం వచ్చేసింది. నిన్న దాకా థియేటర్ ప్రింట్లకు పరిమితమైన పైరసీ ఇప్పుడు హెచ్డి రూపం సంతరించుకుని ప్రమాద హెచ్చరికలు చేస్తోంది. ఈ వార్నింగ్ బెల్ గేమ్ ఛేంజర్ కన్నా ముందే కంగువతో మొదలైనప్పటికీ సరైన సమయంలో నిర్మాతలు మేలుకోకపోవడంతో ఇతర భాషలకూ పాకుతోంది.
ఇది కేవలం నిర్మాతల సమస్య కాదు. పదులు వందల కోట్ల పెట్టుబడులతో హక్కులు కొనే ఓటిటిలకు సైతం పెనుముప్పుగా మారుతోంది. థియేటర్లో సినిమాలు ఆడుతుండగానే ఒరిజినల్ సౌండ్ తో క్వాలిటీ ప్రింట్లు అందుబాటులోకి వచ్చేస్తే సబ్స్క్రిప్షన్లు గణనీయంగా తగ్గిపోతాయి.
గత మూడు నెలల కాలంలో సుమారు పదిహేనుకి పైగా సినిమాలు హెచ్డి రక్కసి బారిన పడటం తీవ్రతను సూచిస్తోంది. నిన్న నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన పుష్ప 2 సైతం దీనికి మినహాయింపు కాలేదు. రిలీజైన 17వ రోజే బయటికి తెచ్చారు. కానీ కంటెంట్ లో బలం వల్ల తట్టుకోగలిగింది.
కానీ ప్రతి సినిమా ఈ స్థాయిలో ఉండదు. ముఖ్యంగా యావరేజ్, డీసెంట్ హిట్లకు జనాన్ని రప్పించడం చాలా కష్టమైన తరుణంలో ఇలాంటి సవాళ్లు ప్రొడ్యూసర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వీటివల్ల భవిష్యత్తులో ఓటిటి నిబంధనలు మరింత కఠినంగా మారిపోయి లీక్ వస్తే కనక డబ్బులో కోత విధిస్తామని బెదిరించినా ఆశ్చర్యం లేదు.
పరిస్థితి మరింత దారుణంగా మారకముందే చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా డబ్బింగ్ చేస్తున్న ప్యాన్ ఇండియా సినిమాలకు ఈ బెడద అధికంగా ఉంది. డాకు మహారాజ్ ని కూడా వదల్లేదు. కేవలం తెలుగులో మాత్రమే రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం దీని బారిన పడకపోవడం గమనించాల్సిన అంశం.
అసలు హెచ్డి సోర్స్ కి లింక్ ఎక్కడి నుంచి వెళ్తోందో గుర్తిస్తే తప్ప అరికట్టడం అసాధ్యం. ప్రస్తుతానికి చూసి చూడనట్టు ఉందాం అని వదిలేస్తే పరిణామాలు ఊహకందటం కష్టమే. ఇప్పటిది ఒకరిద్దరి సమస్యగా కనిపించినా రాబోయే రోజుల్లో కరోనా వైరస్ లాగా అందరికీ అంటుకోవడం ఖాయం. ఆలోగానే మందు కనిపెట్టాలి.
This post was last modified on January 31, 2025 12:27 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…