Movie News

పుష్ప 2 ర్యాంపేజ్ : ఇప్పట్లో తగ్గేదే లే…

యాభై రోజులకు పైగా బాక్సాఫీస్ దండయాత్ర చేస్తూనే వచ్చిన పుష్ప 2 ది రూల్ ప్రేక్షకుల నిరీక్షణకు బ్రేక్ వేస్తూ నిన్న నెట్ ఫ్లిక్స్ లో వచ్చేసింది. అదనపు ఫుటేజ్ తో 3 గంటల 44 నిమిషాల రీ లోడెడ్ వెర్షన్ ఓటిటిలో రిలీజ్ చేయడం ఇదే మొదటిసారి. గతంలో జవాన్, పఠాన్ లాంటివి చేశారు కానీ వాటికి జోడించిన సీన్లు కేవలం కొన్ని నిముషాలు లేదా సెకండ్లు మాత్రమే.

కానీ పుష్ప 2 ఏకంగా పెద్ద ఎత్తున ఎపిసోడ్లు యాడ్ చేసుకుని వచ్చింది. పబ్లిసిటీ విషయంలో నెట్ ఫ్లిక్స్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇవాళ దినపత్రికల్లో ఏకంగా ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారంటే రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

సోషల్ మీడియాలోనూ అదే తరహా దూకుడుతో పబ్లిసిటీ చేస్తున్న నెట్ ఫ్లిక్స్ పుష్ప 2 నుంచి మతిపోయే వ్యూస్ ని ఆశిస్తోంది. మహారాజా ఇప్పటిదాకా 20 మిలియన్లకు దగ్గరగా ఉండగా దాన్ని దాటే లక్ష్యంతో పుష్పరాజ్ పరుగులు పెడుతున్నాడు. షూటింగ్ జరుగుతున్నప్పుడే ప్రత్యేకంగా ఓటిటి ప్రోమోల కోసం వీడియోలు షూట్ చేశారంటే నెట్ ఫ్లిక్స్ బృందం ఎంత పక్కా ప్రణాళికతో ఉందో అర్థం చేసుకోవచ్చు.

క్రేజ్ గమనించిన అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ పుష్ప 1 ది రైజ్ హిందీ వెర్షన్ ని ఉచితంగా స్ట్రీమింగ్ చేయడం మొదలుపెట్టింది. క్రేజ్ క్యాష్ చేసుకోవడానికి కాంపిటీటర్లు కూడా పోటీ పడుతున్నారు.

సో డిజిటల్ లో పుష్ప 2 రూల్ అరాచకం ఏ స్థాయిలో ఉండబోతోందో అర్థం కావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాలి. ఇప్పటికీ షిఫ్ట్ చేసిన థియేటర్లతో మెయిన్ సెంటర్లలో పుష్ప 2 ఆడుతూనే ఉంది. బుక్ మై షో ట్రెండింగ్ లో గత ఆదివారం దాకా కొనసాగడం మాములు విషయం కాదు.

అధికారికంగా చెప్పలేదు కానీ నెట్ ఫ్లిక్స్ పుష్ప 2 హక్కుల కోసం పెట్టిన మొత్తం నూటా యాభై నుంచి రెండు వందల కోట్ల పైమాటేనని ఇన్ సైడ్ టాక్. అంత మొత్తం రికవరీ కావాలంటే ఓ రేంజ్ లో వ్యూస్ పేలిపోవాలి. బాక్సాఫీస్ దగ్గర రెండు వేల కోట్లకు దగ్గరైనవాడు ఓటిటిలో మాత్రం ఊరుకుంటాడా. ఎన్ని రికార్డులు నమోదు చేస్తాడో.

This post was last modified on January 31, 2025 1:22 pm

Share

Recent Posts

నాని నిర్ణయం రిస్క్ అవుతుందా

ప్యారడైజ్ ఫలితం తర్వాత నాని కొంచెం డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. పదే పదే మాస్ ని లక్ష్యంగా…

31 minutes ago

అదుర్స్ కొనసాగింపు కుదరదని తెలిసినా

కొన్ని సినిమాలకు కొనసాగింపులు సులభం కాదు. ఏదో జనాల్లో క్రేజ్ ఉంది కదాని, సోషల్ మీడియాలో హైప్ ఉంది లెమ్మని…

1 hour ago

సెన్సార్ బోర్డుపై కుండబద్దలు కొట్టిన కోన

సినిమాల సెన్సార్షిప్‌ విషయంలో పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఈ మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో…

2 hours ago

మోదీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం

వందేళ్ల క్రితం సైమన్ ను రక్షించడానికి ప్రయత్నించిన బ్రిటీష్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను రక్షించాలని ప్రయత్నం…

3 hours ago

మత రాజకీయమే మార్గమా సాయిరెడ్డి?

వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి సగటు రాజకీయ నాయకుడి నుంచి మతపరమైన రాజకీయాలు చేసి…

4 hours ago

మెగాస్టార్ లిస్టులో వద్దనుకున్న పేరుందా

కాకా జనవరిలో సంక్రాంతి పండక్కు వచ్చేస్తుంది. తక్కువ గ్యాప్ లో విశ్వంభర దిగుతుంది. తర్వాత ఎవరితో సినిమా ఉంటుందనేది చిరంజీవి…

4 hours ago