అనుపమ పరమేశ్వరన్ స్వతహాగా మలయాళీ అమ్మయే అయినా.. తెలుగులోనే ఆమెకు ఎక్కువ అవకాశాలు లభించాయి. ఇక్కడే ఆమె స్టార్ హీరోయిన్ అయింది. కెరీర్ ఆరంభంలో ప్రేమమ్, అఆ, శతమానం భవతి లాంటి సినిమాలతో ఆమె కెరీర్ దూసుకెళ్లింది. కానీ ఆ ఊపును ఆ తర్వాత కొనసాగించలేకపోయిందామె. మధ్యలో వరుసగా ఫ్లాపులొచ్చాయి. అయినా కొంచెం పుంజుకుని మళ్లీ సినిమాలు దక్కించుకుంది. హిట్లు కూడా ఇచ్చింది. అయినా సరే రేసులో ఆమె వెనుకబడిపోయింది.
హలో గురూ ప్రేమ కోసమే, రాక్షసుడు లాంటి హిట్ల తర్వాత కూడా ఆమె లైమ్ లైట్లో లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇక టాలీవుడ్లో అనుపమ కెరీర్ ముగిసినట్లే అని అంతా భావిస్తున్న తరుణంలో ఎట్టకేలకు మళ్లీ ఓ ఛాన్స్ అందుకుంది ఈ మలయాళ కుట్టి.
నిఖిల్ హీరోగా సుకుమార్ స్క్రిప్టుతో ఆయన శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ రూపొందించనున్న కొత్త సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా ఖరారైంది. గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ ఉమ్మడిగా నిర్మించనున్న ఈ సినిమాలో అనుపమ నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
నిజానికి ఈ సినిమా కథానాయికగా ముందు వినిపించిన పేరు అనుపమదే. కానీ తర్వాత ఆమె స్థానంలోకి గ్యాంగ్ లీడర్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ వచ్చినట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ప్రచారానికి తెర దించుతూ అనుపమను కథానాయికగా ప్రకటించారు. ఇది ఒక డైరీ నేపథ్యంలో సాగే సినిమా. కథానాయిక పాత్ర కీలకంగా ఉంటుందట. సుకుమార్ స్క్రిప్టు అంటే ఇందులో ఏదో ప్రత్యేకత ఉంటుందనే అంతా అనుకుంటున్నారు. మరి ఈ సినిమాతో అనుపమ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
This post was last modified on October 19, 2020 7:47 am
తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…
నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా…
తమిళ నటుడు సూర్య పెద్ద స్టార్ హీరో అయినా.. ఏమాత్రం భేషజం లేని, ఉన్నత వ్యక్తిత్వం తనది. అభిమానులను అక్కున…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా కబురు వచ్చేసింది. కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్నట్లే విలక్షణ దర్శకుడు వివేక్ ఆత్రేయ…
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు అనుమతులు ఆలస్యమవుతున్నాయని ఎలాన్ మస్క్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత వ్యాపారవేత్తల కారణంగానే తమ…
ఏపీ మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్ విధించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ మంత్రివర్గం..…