ఒకప్పుడు తెలుగులో స్టార్ హోదా అనుభవించి.. ఆపై మాతృ భాష తమిళంలోనే సినిమాలు చేసుకుంటున్న సిద్దార్థ్‌కు చాలా ఏళ్ల నుంచి సరైన సక్సెస్ లేదు. ‘చిత్తా’ అనే ఓ సినిమా మాత్రం ఓ మాదిరిగా ఆడింది. ఐతే తన సినిమాల ప్రమోషన్ల టైంలో గత వైభవం గురించి మాట్లాడుతూ.. తన ప్రస్తుత చిత్రాలు సరిగా ఆడకపోవడం పట్ల ఒక రకమైన అసహనాన్ని ప్రదర్శిస్తుంటాడు సిద్ధు. కొన్నిసార్లు తన కెరీర్ దెబ్బ తినడానికి కారణమంటూ ఇండస్ట్రీ జనాల మీద విమర్శలు గుప్పిస్తాడు.
మరికొన్నిసార్లు ప్రేక్షకుల మీదే తన ఫ్రస్టేషన్ చూపిస్తుంటాడు. తాజాగా ఒక కార్యక్రమంలో అతను తాను పెద్ద స్టార్ కాకపోవడానికి కారణాలు చెబుతూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. హీరోయిన్ల నడుములు గిల్లే, వాళ్లను చెంపదెబ్బ కొట్టే సీన్లు.. వాళ్లను కించపరిచేలా ఉన్న సన్నివేశాలు ఉండడం వల్ల చాలా సినిమాలను తాను రిజెక్ట్ చేశానని.. అందుకే తాను పెద్ద స్టార్ కాలేకపోయానని సిద్ధు వ్యాఖ్యానించాడు.
ఐతే సిద్ధుది హిపోక్రసీ అంటూ ఈ రోజు కౌంటర్లు మొదలయ్యాయి. తన సినిమాల్లో హీరోయిన్ల గ్లామర్‌ను ఎలివేట్ చేసిన సన్నివేశాలు.. పాటలను ఉదహరిస్తూ తనను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ‘ఆట’ సినిమాలో ఇలియానాతో కలిసి అతను చేసిన రొమాంటిక్ సాంగ్స్.. అందులో పదే పదే ఆమె నడుమును చూపించడం.. సిద్ధు కూడా కొన్ని ఇబ్బందికర భంగిమల్లో డ్యాన్సులు చేయడం గురించి నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు.
అదే సినిమాలో హీరోయిన్ కట్టుకుని ఉన్న టవల్ తీసి ఆమెతో పాటు చుట్టుకునే సన్నివేశం తాలూకు వీడియో తీసి.. ఇలాంటి సీన్ల విషయంలో ఏ అభ్యంతరాలు లేకుండా నటించి ఇప్పుడు శుద్ధ పూసలా కబుర్లు చెబితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ‘గృహం’ లాంటి చిత్రాల్లో లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్ల మాటేంటి అని కూడా అడుగుతున్నారు. వృద్ధనారీ ప్రతివత సామెతను గుర్తు చేస్తూ.. సిద్ధు తీరును ఎండగడుగుతున్నారు నెటిజన్లు. మరి ఈ కౌంటర్లకు సిద్ధు ఏమని బదులిస్తాడో?
This post was last modified on January 30, 2025 7:33 pm
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…