గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ సినిమాలేవీ సరిగా ఆడలేదు. వరుస డిజాస్టర్లలో అల్లాడిపోతున్నాడాయన. అయితేనేం ఆయనకు అవకాశాలకేమీ లోటు లేదు. వరుసబెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం ‘క్రాక్’లో నటిస్తున్న రవితేజ తాజాగా ‘ఖిలాడి’ అనే సినిమాను అనౌన్స్ చేశాడు. ఇంతకుముందు రవితేజతో ‘వీర’ తీసిన రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. రమేష్ వర్మతో ‘రాక్షసుడు’ నిర్మించిన కోనేరు సత్యనారాయణ ‘ఖిలాడి’ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
ఐతే రమేష్ వర్మ తన సొంత కథలతో తీసిన సినిమాలేవీ ఆడలేదు. ఓ కొరియన్ మూవీని కాపీ కొట్టి తీసిన ‘రైడ్’, తమిళ హిట్ ‘రాక్షసన్’ను రీమేక్ చేస్తూ తీసిన ‘రాక్షసుడు’ మాత్రమే అతడి కెరీర్లో సక్సెస్‌ఫుల్ సినిమాలు. మరి రవితేజ.. తనకు గతంలో డిజాస్టర్ ఇచ్చిన విషయాన్ని కూడా మరిచిపోయి రమేష్ వర్మతో ఇప్పుడు ఎలా సినిమా ఓకే చేశాడు అన్నది అందరి సందేహం.
ఐతే రవితేజ కోసం కూడా రమేష్ వర్మ అరువు కథనే పట్టుకొచ్చాడంటూ ఈ మధ్య వార్తలొచ్చాయి. ప్రస్తుతం అనౌన్స్ చేసిన టైటిల్, ప్రి-ఫస్ట్ లుక్ పోస్టర్లు చూస్తే ఆ సందేహాలే నిజమని అర్థమవుతోంది. తమిళంలో అరవింద్ స్వామి, త్రిష జంటగా నటించిన ‘శతురంగ వేట్టై-2’ కథతోనే ఈ సినిమా తెరకెక్కనుందట. గతంలో వచ్చిన ‘శతురంగ వేట్టై’ తమిళంలో సెన్సేషనల్ హిట్టయింది. దీన్నే తెలుగులో ‘బ్లఫ్ మాస్టర్’గా తీశాడు. తెలివిగా ఆర్థిక నేరాలు చేసే ఒక మోసగాడి కథతో తెరకెక్కిన చిత్రమిది. అలాంటి కథతోనే ‘శతురంగ వేట్టై-2’ తెరకెక్కింది. ఐతే వేరే కారణాల వల్ల ఆ సినిమా కొన్నేళ్లుగా విడుదలకు నోచుకోకుండా ఉంది.
త్వరలోనే ఒక ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో ఆ చిత్రాన్ని విడుదల చేస్తారంటున్నారు. ఐతే ఇది మంచి కథ అని తెలుసుకుని రమేష్, రవితేజ ఆ సినిమా చూసి మెచ్చి, విడుదలకు ముందే రీమేక్ చేయడానికి రెడీ అయిపోయారు. ప్రి లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్లలో డబ్బు కట్టలు కనిపిస్తుండటం, ‘ఖిలాడి’ అనే టైటిల్ పెట్టడాన్ని బట్టి ఇది ఆ హీస్ట్ థ్రిల్లర్‌కు రీమేకే అని రూఢి అయిపోయింది. మరి రవితేజతో ఈసారైనా రమేష్ హిట్ కొడతాడేమో చూడాలి.
This post was last modified on October 19, 2020 7:43 am
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…