దర్శకుడిగా తొలి చిత్రం ‘కార్తికేయ’తోనే తన సత్తా ఏంటో చూపించాడు చందూ మొండేటి. అతడి రెండో చిత్రం ‘ప్రేమమ్’ కూడా హిట్టే. మూడో సినిమా ‘సవ్యసాచి’ మాత్రం తేడా కొట్టింది. ఆ తర్వాత ‘కార్తికేయ-2’ బలంగా పుంజుకున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయింది. దీంతో చందూ మొండేటి పేరు మార్మోగింది. పెద్ద హీరోలు సైతం అతడితో సినిమా చేయడానికి రెడీ అయ్యారు.
చందూ తర్వాతి సినిమాను నిర్మించడానికి అల్లు అరవింద్ లాంటి పెద్ద నిర్మాత ముందుకు వచ్చారు. వీరి కలయికలో నాగచైతన్య హీరోగా ‘తండేల్’ రాబోతోంది. ఈ సినిమాకు మంచి హైపే వచ్చింది. ఐతే నిజానికి దీని బదులు చందూ.. గీతా ఆర్ట్స్ సంస్థలో వేరే పెద్ద సినిమా చేయాల్సిందట. అందుకోసం ఏకంగా రూ.300 బడ్జెట్ పెట్టడానికి కూడా అరవింద్ రెడీ అయ్యారట. కానీ చందూ మాత్రం ‘తండేల్’ చేయడానికే మొగ్గు చూపాడట.
దీని గురించి ఓ ఇంటర్వ్యూలో అతను ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.‘‘కార్తికేయ-2 తర్వాత గీతా ఆర్ట్స్‌లో సినిమా చేయాల్సి వచ్చినపుడు.. తండేల్ కథ నా ముందుకు వచ్చింది. ఐతే అరవింద్ గారు నన్ను ఆ కథ చేయొద్దన్నారు. కార్తికేయ-2ను నేను హ్యాండిల్ చేసిన తీరు గురించి చెబుతూ పెద్ద సినిమా చేద్దామన్నారు. మన దగ్గర సూర్య ఉన్నాడు, అలాగే రామ్ చరణ్ సైతం అందుబాటులో ఉన్నాడు.. కాబట్టి పెద్ద కాన్వాస్‌లో సినిమా చేద్దామని ప్రపోజల్ పెట్టారు.
అంతే కాక రూ.300 కోట్ల దాకా బడ్జెట్ పెట్టడానికి కూడా సిద్ధమని చెప్పారు. కానీ నేను మాత్రం ‘తండేల్’ కథే ఎందకు చేయకూడదు అన్నాను. ఆ కథే నాకు ఎక్కువ నచ్చి దాన్నే చేయడానికి రెడీ అయ్యాను’’ అంటూ ఆశ్చర్యకర విషయం చెప్పాడు చందూ. అరవింద్ లాంటి లెజెండరీ ప్రొడ్యూసర్.. తనను నమ్మి 300 కోట్ల బడ్జెట్.. సూర్య లేదా రామ్ చరణ్ లాంటి హీరోను ఇస్తానన్నా కూడా అవి వద్దని ‘తండేల్’ చేయడం అంటే విశేషమే. అతను అంతగా ఇష్టపడి చేసిన సినిమాకు ఇప్పుడు ఎలాంటి ఫలితం వస్తుందన్నది ఆసక్తికరం.
This post was last modified on January 30, 2025 1:13 pm
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…