Movie News

‘రాధేశ్యామ్’కు మరో కాపీ మరక


ఇంటర్నెట్, సోషల్ మీడియా విప్లవం కారణంగా ప్రపంచం చాలా చిన్నదైపోయింది. నెటిజన్లు ఇంటర్నెట్‌ను కాచి వడబోసేస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల నుంచైనా సరే.. ఒక సన్నివేశాన్నో.. లేదా ఒక మ్యూజిక్ బిట్‌నో.. లేదా ఒక పోస్టర్‌నో కాపీ కొట్టినా, స్ఫూర్తి పొందినా ఇట్టే పట్టేస్తున్నారు. ఇలాంటపుడు ఫిలిం మేకర్స్ జాగ్రత్తగా ఉండాల్సిందే. కాపీ కొట్టిన వాటికి ఎంత మేకప్ చేసినా సరే.. దాచడం కష్టమైపోతోంది.

తాజాగా ‘రాధేశ్యామ్’ టీం రిలీజ్ చేసిన కొత్త పోస్టర్‌ను తీర్చిదిద్దిన వాళ్లు కూడా దొరికిపోయారు. ఈ నెల 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో ఒక పోస్టర్ వదిలిన సంగతి తెలిసిందే. పాత కాలం నాటి రైలు బండి నుంచి దట్టమైన పొగ బయటికొస్తూ ట్రాక్ పై ప్రాంతాన్నంతా కమ్మేస్తున్న దృశ్యం కనువిందుగా అనిపిస్తోంది. భలే ఉందే పోస్టర్ అంటూ నెటిజన్లు దాని మీద కామెంట్ చేశారు.

కానీ అందులో ‘రాధేశ్యామ్’ టీం క్రియేటివిటీ ఏమీ లేదని కొన్ని గంటల్లోనే తేలిపోయింది. దీని తాలూకు ఒరిజినల్ పిక్‌ను బయటికి తీసేశారు నెటిజన్లు. కాకపోతే ఆ పిక్‌‌కు ఫొటో షాప్ ఎఫక్ట్స్ జోడించి వేరే కలర్‌లోకి తీసుకొచ్చారు. పిక్‌ను క్లోజప్ చేశారు. కానీ ఎంత చేసినా ఒరిజినల్ పిక్‌ను పక్కన పెట్టి చూస్తే దానికిది కాపీ అనే విషయం అర్థమైపోతోంది.

ఇంతకుముందు ‘రాధేశ్యామ్’ టీం రిలీజ్ చేసిన ప్రభాస్, పూజా హెగ్డేల ఫస్ట్ లుక్ పోస్టర్.. ‘కంచె’ సినిమా ఫస్ట్ లుక్‌ను గుర్తుకు తేవడం తెలిసిందే. ఎంత ఎఫెక్ట్స్ జోడించినా సరే.. ‘కంచెం’ లుక్‌కు కాపీ లాగే అనిపించిందది. ఇంతకుముందు ప్రభాస్ నటించిన ‘సాహో’ ఫస్ట్ లుక్ పోస్టర్ మీద, దాని కంటే ముందు ‘బాహుబలి’ ప్రి లుక్ పోస్టర్ మీద కూడా ఇలాగే కాపీ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వరుసగా నెటిజన్లు ఇలా గాలి తీసేస్తున్నా సరే.. ప్రభాస్ సినిమాల మేకర్స్ జాగ్రత్త పడకుండా ఇలా కాపీ కొట్టడమో, స్ఫూర్తి పొందడమో చేసి మళ్లీ మళ్లీ దొరికిపోతుండటం ఏంటో?

This post was last modified on October 20, 2020 8:16 am

Share

Recent Posts

పవన్ పాలనకు చిరు కితాబు

తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…

36 minutes ago

రామాయణ చుట్టూ పోటీ ఆంజనేయుళ్లు

నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా…

1 hour ago

పిల్లల స్కూలు విషయాలు సూర్యనే చూసుకుంటాడు

తమిళ నటుడు సూర్య పెద్ద స్టార్ హీరో అయినా.. ఏమాత్రం భేషజం లేని, ఉన్నత వ్యక్తిత్వం తనది. అభిమానులను అక్కున…

1 hour ago

రవితేజకు జోడీ ఎవరు?

మాస్ రాజా రవితేజ కొత్త సినిమా కబురు వచ్చేసింది. కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్నట్లే విలక్షణ దర్శకుడు వివేక్ ఆత్రేయ…

1 hour ago

మస్క్‌కు BYD ప్రశ్న… సమాధానం ఏది?

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు అనుమతులు ఆలస్యమవుతున్నాయని ఎలాన్ మస్క్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత వ్యాపారవేత్తల కారణంగానే తమ…

1 hour ago

టార్గెట్ @ 100 ప‌ర్సంట్‌: మంత్రుల‌కు బాబు బిగ్ టాస్క్‌

ఏపీ మంత్రుల‌కు సీఎం చంద్ర‌బాబు బిగ్ టాస్క్ విధించారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ఏపీ మంత్రివ‌ర్గం..…

2 hours ago