Movie News

కోలీవుడ్ కొంప ముంచిన 200 ఫ్లాపులు

పరిశ్రమ పచ్చగా ఉండాలంటే ఎక్కువ సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు పడాలి. అసలే ఇది ఓటిటి యుగం. మార్నింగ్ షోకి టాక్ ఏ మాత్రం తేడా కొట్టినా సాయంత్రం ఆటకు జనం ఉండటం లేదు. పెద్ద చిన్న తేడా లేకుండా అందరు హీరోలకు ఇది అనుభవమే. అలాంటిది ఏకంగా 223 ఫ్లాపులు ఒకే ఇండస్ట్రీ నుంచి వచ్చాయంటే అంత కంటే షాక్ వేరే ఉంటుందా.

ప్రస్తుతం కోలీవుడ్ ఈ దశను చూస్తోంది. 2024 సంవత్సర కాలానికి 240కి పైగా సినిమాలు నిర్మిస్తే వాటిలో కేవలం 20 లోపే విజయం సాధించడం ఆందోళన కలిగిస్తోంది. వీటి మీద మొత్తం పెట్టుబడి మూడు వేల కోట్లను దాటిపోయి ఉంటుందని ట్రేడ్ ప్రాధమిక అంచనా.

ఇంత దారుణమైన పరిస్థితికి దోహదం చేసిన ప్యాన్ ఇండియా సినిమాల గురించి చెప్పుకోవాలి. మొదటిది కంగువ. నిర్మాత ఏకంగా రెండు వేల కోట్ల వసూళ్లు చేస్తుందని ఇచ్చిన స్టేట్ మెంట్ కి బద్ద వ్యతిరేకంగా కనీసం రెండు వందల కోట్లు కూడా తేలేకపోయింది. ఇక ఇండియన్ 2 గురించి తలుచుకోవడానికి కూడా అక్కడి బయ్యర్లు భయపడుతున్నారు.

వెట్టయన్ ఏదో హడావిడి చేశారు కానీ ఇది కూడా కష్టం మీద గట్టెక్కిన లాస్ వెంచరే. రజనీకాంత్ అతిథి పాత్రను నమ్ముకుని బిల్డప్ ఇచ్చిన లాల్ సలామ్ కనీసం పబ్లిసిటీ ఖర్చులను కూడా తేలేదు. విజయ్ గోట్ నెగటివ్ టాక్ తో బ్రేక్ ఈవెన్ అందుకోవడం కొంత ఊరట కలిగించింది.

ప్రస్తుతం తమిళ పరిశ్రమలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. కాకపోతే 2025 ఓపెనింగ్ బాగుండటం కొంత ఊరట కలిగిస్తోంది. మదగజరాజా పన్నెండేళ్ల తర్వాత రిలీజై 60 కోట్లను మించి వసూలు చేయడం మాములు కిక్ ఇవ్వలేదు. తాజాగా కుటుంబస్తాన్ పాజిటివ్ టాక్ క్రమంగా కలెక్షన్లను పెంచుతోంది.

గేమ్ ఛేంజర్ దెబ్బ ముందే ఊహించడంతో దానికేం వర్రీ అవ్వలేదు. తమిళంతో పోలిస్తే టాలీవుడ్ చాలా పైఎత్తులో ఉంది. హనుమాన్, నా సామిరంగా, టిల్లు స్క్వేర్, దేవర, కల్కి 2898 ఏడి, పుష్ప 2 ది రూల్, సరిపోదా శనివారం ఇలా పెద్ద హిట్లు భారీ సంఖ్యలో నమోదయ్యాయి. మనోళ్ల స్పీడ్ ఈ ఏడాది కూడా తగ్గేలా లేదు.

This post was last modified on January 30, 2025 9:59 am

Share

Recent Posts

బీజేపీ ఎమ్మెల్యే అక్ర‌మాల‌పై నేరుగా మోడీకే ఫిర్యాదు చేసిన ఫ్రెండ్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ బీజేపీ అగ్ర‌నేత‌. ఇక‌, ఆయ‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌. తాజాగా మోడీ చిన్న‌నాటి స్నేహితుడు,…

34 minutes ago

రామాయణ సంగీతానికి తెర లేచింది

విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…

37 minutes ago

హైదరాబాద్ లో బాలికను రేప్ చేసిన 8 మంది

మొన్న ఢిల్లీ బస్సులో ఓ అమ్మాయిని రేప్ చేస్తే నేడు హైదరాబాద్ లో ఒకరి తర్వాత మరొకరు, ఎక్కడ దొరికితే…

56 minutes ago

జైలర్ 2 మీద పందెం కాసేదెవరు

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…

2 hours ago

నిర్మాత రిస్క్ చేశాడు… జాక్‌పాట్ కొడుతున్నాడు

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంత‌కుముందులా ఉదారంగా కొత్త సినిమాల‌ను కొన‌ట్లేద‌న్న సంగ‌తి తెలిసిందే. నిర్మాత‌లు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫ‌ర్…

2 hours ago

సుకుమార్ మీద దేవి ఫ్యాన్స్ ఎటాక్

కొంద‌రు ద‌ర్శ‌కులు టెక్నీషియ‌న్ల విష‌యంలో చాలా ప‌ర్టికుల‌ర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…

5 hours ago