Movie News

57 రోజులైనా.. అచేతనంగానే బన్నీ బుల్లి ఫ్యాన్ శ్రీతేజ్

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డిసెంబర్ 4ను ఎన్నటికీ మరిచిపోలేడు. కారణమేమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. బన్నీ హిట్ మూవీ పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరగగా… బన్నీని చూసేందుకు వచ్చిన రేవతి అక్కడికక్కడే చనిపోగా…ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో శ్రీతేజ్ ఊరిపి ఆగిపోగా… క్షణాల్లో అందిన సీపీఆర్ తో బతికిపోయాడు. ఆ తర్వాత అతడిని సికింద్రాబాద్ లోని కిమ్స్ కు తరలించారు.

శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు కొన్నిరోజుల పాటు అతడికి వెంటిలేటర్ పై చికిత్స అందించారు. ఆ తర్వాత అతడిని స్పెషల్ వార్డుకు తరలించారు. గురువారం నాటికి అతడు ఆసుపత్రిలో చేరి 57 రోజులు కావస్తోంది. అయినా కూడా అతడి ఆరోగ్యం మెరుగుపడిన దాఖలానే కనిపించలేదు. ఇప్పటికీ అతడు ఎవరితో మాట్లాడలేకపోతున్నాడు. కనీసం తనను పరామర్శించేందుకు వచ్చే వారితో పాటు తన కుటుంబ సభ్యులను కూడా అతడు కళ్లు తెరిచి కూడా చూడలేకపోతున్నాడు. ఇప్పటికీ అతడికి లిక్విడ్ ఫుడ్ నే అందిస్తున్నారు. అది కూడా ముక్కు ద్వారంలో ఏర్పాటు చేసిన ఓ పైపు ద్వారా ఆహారాన్ని అందిస్తున్నారు.

శ్రీతేజ్ కు ఇంకెన్ని రోజులు చికిత్స అందిస్తే అతడి ఆరోగ్యం బాగుపడుతుందన్న విషయాన్ని వైద్యులే చెప్పలేకపోతున్నారు. బన్నీ అంటే విపరీతమైన అభిమానం ఉన్న శ్రీతేజ్ కోరిక మేరకే అతడి ఫ్యామిలీ నాడు సంధ్య థియేటర్ కు వచ్చిందట. ఈ క్రమంలో జరిగిన ప్రమాదంలో శ్రీతేజ్ తన తల్లిని కోల్పోయాడు. తాను ఆసుపత్రి బెడ్ కు పరిమితమయ్యాడు. ప్రస్తుతం అతడు శ్వాసను మాత్రమే సొంతంగా తీసుకోగలుగుతున్నాడు. మిగిలిన ఏ పనికీ అతడి శరీరం సహకరించడం లేదు.ఈ ప్రమాదం నేపథ్యంలో ఏకంగా అరెస్ట్ అయిన బన్నీ… సినిమా హిట్ ను కూడా ఎంజాయ్ చేయలేక నానా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

This post was last modified on January 30, 2025 9:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సీతమ్మ వాకిట్లో.. నాగ్ వాకిట నుంచే

ఒక కథ ఒక చోటి నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయడం.. ఎవరికో అనుకున్న కథ ఇంకెవరికో సెట్ కావడం…

4 hours ago

బీజేపీలో పాత సామాన్లు: రాజా సింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఘోషా మ‌హ‌ల్ ఎమ్మెల్యే, వివాదాల‌కు కేంద్రంగా ఉన్న రాజా సింగ్ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.…

8 hours ago

హీరో-డైరెక్టర్ ‘పాడు కాస్ట్’ అదిరిపోలా

కేవలం సినిమాలో వినోదం ఉంటే సరిపోదని.. ప్రమోషన్లను కూడా సినిమా థీమ్‌కు తగ్గట్లు సరదాగా డిజైన్ చేసి ప్రేక్షకుల దృష్టిని…

9 hours ago

దేశవ్యాప్తంగా 5G.. ఏ రేంజ్ లో ఉందంటే..

భారతదేశంలో 5G సేవలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 776 జిల్లాల్లో…

9 hours ago

నా సినిమా సేఫ్ అంటున్న దర్శకుడు

‘మిర్చి’ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ‘నా ఫ్యామిలీ సేఫ్’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన…

10 hours ago

బాబుతో నాగం భేటీ… ఎన్నెన్ని తీపి గురుతులో?

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును గురువారం తెలంగాణకు చెందిన సీనియర్ మోస్ట్ రాజకీయ నేత, మాజీ మంత్రి…

11 hours ago