ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాలేదు కానీ జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాకు డ్రాగన్ టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు నెలల క్రితమే న్యూస్ బయటికి వచ్చింది. అయితే యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేకపోయింది కానీ పేరు మాత్రం భలే పవర్ ఫుల్ గా ఉందని అభిమానులు సంబరపడ్డారు.
కట్ చేస్తే ఇదే పేరుతో లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఫిబ్రవరి 21 విడుదల కానుంది. ప్రోమోలు, లిరికల్ వీడియోలు చూస్తే వర్కౌట్ అయ్యేలానే కనిపిస్తోంది. హిట్టయితే మాత్రం మారుమ్రోగుతుంది.
అదే జరిగితే భవిష్యత్తులో ఇదే డ్రాగన్ టైటిల్ ని తారక్ కి పెట్టుకోవడం కుదరదు. గతంలో ఇలాంటి సమస్య పలు సందర్భాల్లో వచ్చింది. ఖలేజా, కత్తి, గ్యాంగ్ లీడర్ లకు కాంట్రావర్సి వచ్చినప్పుడు నిర్మాతలు వాటి ముందు హీరోల పేర్లు పెట్టి మేనేజ్ చేశారు. కానీ ఇప్పుడలా కుదరదు.
ఒకవేళ ఎన్టీఆర్ డ్రాగన్ అని పెట్టినా సింక్ అవ్వదు. పైగా యాంటీ ఫ్యాన్స్ కావాలని ప్రదీప్ డ్రాగన్ పోలిక తీసుకొచ్చి సోషల్ మీడియాలో రచ్చ చేస్తారు. సో ప్రశాంత్ నీల్ దేనికి కట్టుబడతాడనేది ఇప్పుడే చెప్పలేం. ఫిబ్రవరి నుంచి చిత్రీకరణకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఏదైనా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
అయినా తారక్ లాంటి ప్యాన్ ఇండియా హీరో పూర్తిగా టైటిల్ మీదే ఆధారపడడు కానీ అలాని దాన్ని తేలిగ్గా తీసుకోవడానికి కూడా లేదు. దేవర కూడా వేరొకరి పేరు మీద రిజిస్టర్ అయ్యుంటే అడిగి తీసుకోవడం ఫ్యాన్స్ కి గుర్తే. కానీ డ్రాగన్ కు ఆ ఛాన్స్ లేదు. పైగా అది తమిళంతో పాటు తెలుగులో కూడా సమాంతరంగా రిలీజవుతోంది.
ఒకవేళ ఎంటర్ ది డ్రాగన్ అని పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన చేయొచ్చు కానీ మరీ అంత ఇంగ్లీష్ సౌండింగ్ ఉన్నా మాస్ కి చేరడం కష్టమే. గేమ్ ఛేంజర్ విషయంలో ఈ పొరపాటు జరిగింది. చూడాలి తారక్ నీల్ చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో. వెయిట్ అండ్ సీ.
This post was last modified on January 30, 2025 9:52 am
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…