Movie News

ఈసారైనా వరుణ్ కంబ్యాక్ ఇవ్వనున్నాడా?

మెగా ఫ్యామిలీ యంగ్ హీరో వరుణ్ తేజ్ కెరీర్ పరంగా కొన్నేళ్లుగా బాగా ఇబ్బంది పడుతున్నాడు. గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్.. రెండేళ్ల వ్యవధిలో అతడి నుంచి వచ్చిన ఈ మూడు చిత్రాలు ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు అయ్యాయి. ఈ స్థితిలో తన ఆశలన్నీ ‘మట్కా’ మీదే నిలిచాయి. కానీ గత నవంబర్లో విడుదలైన ఈ చిత్రం కూడా వరుణ్‌ను తీవ్ర నిరాశకు గురి చేసింది.

గత సినిమాలు ఓ మోస్తరు ఓపెనింగ్స్ అయినా తెచ్చుకున్నాయి. కానీ ఈ చిత్రానికి అదీ లేదు. దాదాపు 40 కోట్ల బడ్జెట్ పెడితే.. థియేటర్ల నుంచి ఐదు శాతం కూడా వెనక్కి రాలేదు. వచ్చిన ఆదాయం థియేటర్ల మెయింటైనెన్స్ ఖర్చులకే సరిపోవడంతో ‘మట్కా’ జీరో షేర్ మూవీగా గుర్తింపు తెచ్చుకుంది. నిర్మాత గట్టి దెబ్బ తిన్నాడు. ఈ ప్రభావం వరుణ్ తర్వాతి సినిమా మీద పడుతుందనే అనుకున్నారు చాలామంది.

కానీ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ హీరోగా చర్చల దశలో ఉన్న సినిమాను యువి క్రియేషన్స్ సంస్థ ముందుకు తీసుకెళ్లడానికే నిర్ణయించింది. ఇటీవలే ఈ చిత్రాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్ర బృందం లొకేషన్ల వేటలో భాగంగా వియత్నాంలో పర్యటిస్తుండడం విశేషం. హీరో, దర్శకుడు, నిర్మాతలు వియత్నాలు వియత్నాలో రెక్కీలో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను చాలా వరకు విదేశాల్లో చిత్రీకరించబోతున్నారట. అందులో భాగంగానే భారీ లొకేషన్ల వేట జరుగుతోంది. వరుస ఫ్లాపులతో మార్కెట్ దెబ్బ తిన్న నేపథ్యంలో వరుణ్‌తో ఈసారి పరిమిత బడ్జెట్లో సినిమా చేస్తారేమో అనుకున్నారు చాలామంది.

కానీ యువి వాళ్లు మాత్రం హీరో మీద నమ్మకం పెట్టి.. తమ బేనర్ స్టాండర్డ్స్ ప్రకారమే సినిమా తీయాలని నిర్ణయించినట్లున్నారు. ఈ చిత్రం వరుణ్‌తో పాటు దర్శకుడు మేర్లపాక గాంధీకి కూడా కీలకమే. అతడి చివరి రెండు చిత్రాలు డిజాస్టర్లు అయ్యాయి.

This post was last modified on January 29, 2025 9:12 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

11 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

1 hour ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

3 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

4 hours ago