స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. కొన్ని నెలల కిందట ఓ పెద్ద వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆయన మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ గతంలో తన దగ్గర అసిస్టెంట్‌గా పని చేసిన ఓ అమ్మాయి కేసు పెట్టడం.. దీంతో అతను జైలు పాలవడం.. ఆపై బెయిల్ మీద బయటికి రావడం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి బాధితురాలి ఫిర్యాదు మేరకు.. ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ సైతం ఒక కేసు పెట్టింది.
దీన్ని సవాలు చేస్తూ జానీ పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్‌ను కొట్టేసినట్లు ఫిలిం ఛాంబర్ ప్రతినిధిగా ఝాన్సీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం చర్చనీయాంశం అయింది. ఐతే ఝాన్సీ పోస్ట్ అబద్ధమంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వెంటనే జానీ మాస్టర్ కూడా సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు. దీంతో ఎవరి వాదన కరెక్ట్ అనే చర్చ మొదలైంది.
ముందుగా ఝాన్సీ పోస్టు విషయానికి వస్తే.. ‘‘ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వేసిన కేసుపై సవాల్ చేస్తూ జిల్లా కోర్టులో జానీ మాస్టర్ వేసిన మధ్యంతర పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. పని చేసే ప్రదేశాలలో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఉంటుందని, POSH మార్గదర్శకాలను అమలు చేసే సంస్థలకు ఎప్పుడూ మద్దతు ఉంటుందనేది మరోసారి రుజువైంది. నిజంగా ఇది చాలా ముఖ్యమైన తీర్పు.
ఈ విషయంలో ఫెడరేషన్ కఠినంగా ఉండి, ధర్మం వైపు నిలబడినందుకు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి ధన్యవాదాలు’’ అని ఝాన్సీ పేర్కొంది. కాసేపట్లోనే ఈ జానీ కౌంటర్‌గా పోస్టు పెట్టాడు. ‘‘తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్లపై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది. ముందస్తుగా నాకు తెలియకుండా జరిగిన యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా, నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతూ ఉన్నారు.
మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో కానీ అసలు తీర్పు వివరాలు బయటకి వచ్చిన రోజున మీ నిజస్వరూపమేంటో, దేని కోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారనేది అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు ఎంతో దూరం లేదు. న్యాయమే గెలుస్తుంది, నిజం అందరికీ తెలుస్తుంది’’ అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
This post was last modified on January 29, 2025 9:06 pm
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…