బాలీవుడ్లో పెద్దగా హడావుడి చేయకుండా తన పనేదో తాను చేసుకుపోయే స్టార్ హీరోల్లో షాహిద్ కపూర్ ఒకడు. తన గురించి పెద్దగా కాంట్రవర్శీలు బయటికి రావు. అలాంటి వ్యక్తి ఇటీవల ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అతను సల్మాన్ ఖాన్‌తో పాటు దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్‌ల మీద పరోక్షంగా విమర్శలు గుప్పించినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా సల్మాన్ మీద చేసినట్లుగా భావిస్తున్న కామెంట్స్ దుమారం రేపాయి.
కొందరు పెద్ద స్టార్లు అక్కడికి వచ్చినా అందరి అటెన్షన్ తన మీదే ఉండాలి అనేట్లుగా నడుస్తారని.. ప్రవర్తిస్తారని కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. షాహిద్ కామెంట్స్ సల్మాన్‌ను ఉద్దేశించిన చేసినవే అంటూ ఆయన ఫ్యాన్స్ షాహిద్ మీద యుద్ధం ప్రకటించారు. అతణ్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై అతను వివరణ ఇచ్చాడు.
తన వ్యాఖ్యలు సల్మాన్‌ను ఉద్దేశించినవి కావని షాహిద్ స్పష్టం చేశాడు. ‘‘నేను ఎవరి మీదైనా విమర్శలు చేయాలనుకుంటే.. ఎంతో సీనియర్ అయిన, మంచి గుర్తింపు ఉన్న అలాంటి వ్యక్తి మీద అస్సలు చేయను. నాకు ఆయన మీద అపారమైన గౌరవం ఉంది. ఆ విషయాన్ని స్ఫష్టం చేయాలనుకుంటున్నా’’ అని షాహిద్ తెలిపాడు. ఇదిలా ఉంటే.. షాహిద్ చేసిన మరో కామెంట్ మాత్రం దీపికా-రణ్వీర్‌ల గురించే అని భావిస్తున్నారు.
తన సినిమా ‘కబీర్ సింగ్’ రిలీజైనపుడు తన స్థాయి చాలా తక్కువ అని పోటీలో ఉన్న ఒక సినిమాలో భాగమైన వ్యక్తులు పీఆర్ ద్వారా నెగెటివ్ ప్రచారం చేయడానికి ప్రయత్నించినట్లు అతను ఆరోపించాడు. ‘కబీర్ సింగ్’ రిలీజైనపుడే దీపికా-రణ్వీర్‌ల ‘పద్మావత్’ విడుదల కావడంతో అతను కామెంట్ చేసింది వీళ్లిద్దరి గురించే అనే చర్చ మొదలైంది. ‘పద్మావత్’ ఫుల్ పాజిటివ్ రివ్యూలు తెచ్చుకున్నప్పటికీ.. మోడరేట్ రివ్యూలు తెచ్చుకున్న ‘కబీర్ సింగ్’ దానిపై స్పష్టమైన ఆధిపత్యం చలాయించింది.
This post was last modified on January 29, 2025 9:01 pm
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…