ఇప్పటిదాకా అధిక శాతం గ్లామరస్ హీరోయిన్ గానే కనిపించిన శ్రీలీలకు డాన్స్ లో విపరీతంగా పేరొచ్చింది కానీ పెర్ఫార్మన్స్ పరంగా దొరికినవి తక్కువే. ఉన్నంతలో భగవంత్ కేసరి మంచి క్యారెక్టరే అయినా బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల ఆయనతో పంచుకోవాల్సి వచ్చింది. గుంటూరు కారం ముందు వెనుక చేసిన సినిమాలు, త్వరలో రాబోయే రాబిన్ హుడ్ అన్నీ మోడరన్ అమ్మాయిలకు ప్రతినిధిగా చేసినవే. తాజాగా తమిళంలో శ్రీలీలకు సరైన డెబ్యూ దొరికింది. ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా రూపొందుతున్న ఈ వింటేజ్ డ్రామాలో రవి మోహన్, అధర్వ కీలక పాత్రలు పోషించారు.
ఇది ఎందుకు జాక్ పాట్ అనాల్సి వచ్చిందంటే పరాశక్తి రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. 1965 ప్రాంతంలో తమిళనాడులో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా రాసుకున్నారు. ఒక కాలేజీ బ్యాక్ డ్రాప్ లో అంటరానితనం, అగ్ర కులాల అహంకారం, ప్రభుత్వాల పక్షపాతం, హిందీ వ్యతిరేక ఉద్యమం ఇలా చాలా కాంట్రావర్సి టాపిక్స్ ఇందులో ఉన్నాయి. టీజర్ లో సాంపిల్స్ చూపించారు. నిజానికిది సూర్య – దుల్కర్ సల్మాన్ – ఫహద్ ఫాసిల్ కాంబోలో తెరకెక్కించాలనుకున్నారు. కానీ కాల్ షీట్స్ సమస్యతో పాటు ఇతరత్రా కారణాల వల్ల ముగ్గురిని మార్చేశారు. నజ్రియాను లాక్ చేసుకున్న క్యారెక్టర్ శ్రీలీలకు ఇచ్చారు.
కంటెంట్ పరంగా చూస్తే సున్నితమైన అంశాల మీద నడిచే పరాశక్తి అమరన్ ని మించిన సక్సెస్ ఇస్తుందని శివ కార్తికేయన్ ధీమాగా ఉన్నాడు. ఇది మిస్ చేసుకున్నందుకు సూర్య బాధ పడతాడనే టాక్ ఫ్యాన్స్ లో ఉంది. వీళ్ళ సంగతి ఎలా ఉన్నా సినిమా క్లిక్ అయితే శ్రీలీలకు కలిగే లాభం పెద్దగా ఉండబోతోంది. కోలీవుడ్ లోనూ ఆఫర్లు వెల్లువెత్తుతాయి. కథ ఏంటనేది ఎక్కువ రివీల్ కాకుండా కట్ చేసిన టీజర్ ఆసక్తి పెంచేలా ఉంది. విడుదల తేదీ ఇంకా లాక్ చేయలేదు కానీ వేసవిలో తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కోలీవుడ్ ఆల్ టైం క్లాసిక్ పేరుని టైటిల్ గా పెట్టుకోవడంతో అంచనాలైతే మాములుగా లేవు.
This post was last modified on January 29, 2025 5:52 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…