Movie News

తండేల్ హైప్ సరిపోతుందంటారా

ఇంకో ఎనిమిది రోజుల్లో తండేల్ రిలీజవుతోంది. సంక్రాంతికి వచ్చిన మూడు భారీ సినిమాల తర్వాత సుమారు నెల గ్యాప్ తో వస్తున్న బిగ్ మూవీ ఇదే. నాగచైతన్య దీని కోసం చాలా కష్టపడ్డాడు. ప్రీ ప్రొడక్షన్ కోసమే నెలల సమయం ఖర్చు పెట్టి శ్రీకాకుళం వెళ్లి భాష, యాస నేర్చుకుని వచ్చాడు. రెమ్యునరేషన్ లాంటి లెక్కలు వేసుకోకుండా కథ విపరీతంగా నచ్చడంతో సాయి పల్లవి ఎస్ చెప్పింది. ఖరీదైనా సరే దేవిశ్రీ ప్రసాద్ తో సంగీతం చేయించుకున్నారు. మూడు పాటలు ఛార్ట్ బస్టర్స్ అయ్యాయి. ముఖ్యంగా బుజ్జి తల్లి సోషల్ మీడియాని ఊపేసింది. మిగిలినవి మెల్లగా ఎక్కుతున్నాయి. నిన్న వైజాగ్ లో ట్రైలర్ లాంచ్ చేశారు.

ఇక్కడ దాకా చూసుకుంటే తండేల్ మీద ఓవర్ హైప్ లేదు. ఎంత మోతాదులో గీతా ఆర్ట్స్ కోరుకుంటుందో అంతే ఉండేలా పబ్లిసిటీ చేస్తున్నారు. మితిమీరిన అంచనాలు రేగేలా ప్రేక్షకులను పక్కదారి పట్టించడం లేదు. దర్శకుడితో సహా ఎవరూ ఓవర్ స్టేట్ మెంట్లు ఇవ్వలేదు. ట్రైలర్ కు స్పందన బాగుంది. అదిరిపోయింది, నెవర్ బిఫోర్ లాంటి మాటలు వినిపించలేదు కానీ కథ ఎక్కువ రివీల్ కాకుండా జాగ్రత్తగా కట్ చేయడం వల్ల కొన్ని మిశ్రమ అభిప్రాయాలు వచ్చాయి. అయితే ఓవరాల్ గా అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటున్న ఎలిమెంట్స్ ఉన్న హామీ అయితే పూర్తిగా దొరికేసింది.

ప్రస్తుతం థియేటర్ల దగ్గర- స్థబ్దు వాతావరణం నెలకొంది. సంక్రాంతికి వస్తున్నాం తప్ప మిగిలినవి వసూళ్లు లాగలేకపోతున్నాయి. డాకు మహారాజ్ బాగా నెమ్మదించింది. గేమ్ ఛేంజర్ మొక్కుబడిగా కొనసాగుతున్నాడు. మొన్న శుక్రవారం వచ్చినవేవీ కనీస స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఎల్లుండి వచ్చే కొత్త రిలీజులు అద్భుతాలు చేసే నమ్మకం లేదు. సో తండేల్ కి ఇది గొప్ప అవకాశం. ముందు రోజు అజిత్ పట్టుదల ఉన్నా తెలుగులో సీరియస్ బజ్ లేదు. సో చైతు కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే సినిమాలో చెప్పినట్టు వసూళ్లలో రాజులమ్మ జాతర జరుగుతుంది.

This post was last modified on January 29, 2025 3:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

1 hour ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

3 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

3 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

6 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

8 hours ago