సోషల్ మీడియా జనాలకు ఒక అలవాటుంది. కొన్ని హాలీవుడ్ సినిమాలు అర్థం కాకపోయినా సరే వాటిని మెచ్చుకోకపోతే మనల్ని మేధావులుగా గుర్తించరని భావించి తెగ పొగిడేస్తూ ఉంటారు. దీనికి కారణం తమను ప్యాషన్ ఉన్న వాళ్ళుగా సర్టిఫికెట్ ఇస్తారనే తాపత్రయం కావొచ్చు. ఆ మధ్య అవతార్ నాకేం పెద్దగా నచ్చలేదని నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్ల మీద మినీ సైజ్ రాద్ధాంతం చేశారు.
ఇప్పుడు మాధవన్ కూడా ఈ లిస్టులో చేరిపోతున్నారు. ఇటీవలే ఆయన ప్రధాన పాత్ర పోషించిన హిసాబ్ బరాబర్ ఓటిటిలో రిలీజయ్యింది. దాని ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ముచ్చట చెప్పారు.
హాలీవుడ్ తన వైభవాన్ని కోల్పోయిందని, గత అయిదేళ్ళుగా ఏ సినిమా తనకు నచ్చలేదని కుండ బద్దలు కొట్టేశారు. ప్రపంచమంతా మెచ్చుకుని బోలెడు అవార్డులు దక్కించుకున్న క్రిస్టోఫర్ నోలన్ ఓపెన్ హెయిమర్ తనను నిరాశపరిచిందని చెప్పడం షాకే. ఇక జోకర్ 2 అయితే దారుణంగా అనిపించిందని, చివరిదాకా చూడలేకపోయానని వ్యాఖ్యానించడం విశేషం.
మాధవన్ ఏ ఉద్దేశంతో చెప్పినా ఇందులో నిజం లేకపోలేదు. ఒకప్పుడు జురాసిక్ పార్క్, మమ్మీ, గాడ్జిల్లా, స్పైడర్ మ్యాన్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ నుంచి పట్టుమని వారం ఆడటమే కష్టమైపోయే రేంజ్ కు ఇంగ్లీష్ సినిమాల ప్రమాణాలు తగ్గిపోయాయి.
ఆస్కార్లు రావొచ్చు, ఎక్కడో విదేశాల్లో వేల కోట్లు వసూలు చేయొచ్చు. కానీ మన ఆడియన్స్ ని మెప్పించలేనప్పుడు ఇండియాలో ఫెయిల్యూర్ గానే పరిగణించాలి. ఆర్ఆర్ఆర్ జపాన్ లో ఏడాది ఆడింది. చైనాలో అమీర్ ఖాన్ సినిమాలకు ఆదరణ దక్కింది. యుఎస్ లో టాలీవుడ్ హిట్ చిత్రాలకు మిలియన్ వసూళ్లు మంచి నీళ్లు తాగినంత ఈజీ.
ఇవి యునానిమస్ గా భాషతో సంబంధం లేకుండా సక్సెసైనవి. ఒకప్పుడు ఇంటర్ స్టెల్లార్ లాంటి వాటిని కూడా అర్థం కాకపోయినా పొగడ్తల వర్షం కురిపించే వాళ్ళు. తీరా థియేటర్లో చూస్తే సరిగా అర్థం కాక జుత్తు పట్టుకునే బ్యాచులు బోలెడు. మాధవన్ మాత్రం ఈ విషయంలో మొహమాటపడలేదు.
This post was last modified on January 29, 2025 3:13 pm
మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…
ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…
కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…
2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…
ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…
యూత్ హీరోలు ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థికంగా ఏమో కానీ కెరీర్ పరంగా ఇబ్బందులు చూడాల్సిన పరిస్థితులు ఇండస్ట్రీలో…