విక్టరీ వెంకటేష్ కెరీర్లో ఈ దశలో బాక్సాఫీస్ దగ్గర ఇలాంటి వైభవం చూస్తాడని.. రికార్డుల మోత మోగిస్తాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. మిడ్ రేంజ్ ఫ్యామిలీ మూవీస్ చేసుకునే వెంకీ.. తన మార్కు సినిమాతోనే రికార్డుల మోత మోగిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా రిలీజైన ఆయన కొత్త చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఏకంగా రూ.300 కోట్ల వసూళ్ల క్లబ్బులోకి అడుగు పెట్టబోతోంది.
సంక్రాంతి రేసులో చివరగా రిలీజైన ఈ చిత్రం.. చాలా వేగంగా బాక్సాఫీస్ లీడర్‌గా మారింది. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ చిత్రాలను వెనక్కి నెట్టి భారీ వసూళ్లతో దూసుకెళ్లింది. ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే సినిమా కావడం దీనికి పెద్ద ప్లస్ అయింది. టికెట్ల ధరలు కూడా నార్మల్‌గానే ఉండడంతో ఫ్యామిలీస్ థియేటర్లకు పోటెత్తుతున్నాయి. రెండో వీకెండ్లో కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ కొత్త సినిమా తరహలో హౌస్ ఫుల్స్‌తో రన్ అయింది.
‘సంక్రాంతికి వస్తున్నాం’కు బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. సంక్రాంతి తర్వాత మామూలుగా రెండో వారం చెప్పుకోదగ్గ రిలీజ్‌లు ఏమీ ఉండవు. పండక్కి వచ్చే సినిమాలకే తర్వాతి వారాన్ని కూడా వదిలిపెట్టేస్తారు. రిపబ్లిక్ డే వీకెండ్లో కొత్త చిత్రాలను రిలీజ్ చేస్తుంటారు. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. గత శుక్రవారం అరడజను చిన్న సినిమాలు రిలీజయ్యాయి కానీ.. ఏవి కూడా కొంచెం కూడా సౌండ్ చేయలేకపోయాయి.
ఇక ఈ వీకెండ్లో సైతం చెప్పుకోదగ్గ రిలీజ్‌లు లేవు. తమిళ అనువాదం ‘మదగజ రాజా’ కాస్త చెప్పుకోదగ్గ చిత్రం. దీనికి కూడా బజ్ అంతంతమాత్రమే. ఈ పాత సినిమాను తమిళ ప్రేక్షకులు ఎగబడి చూసినట్లు తెలుగు వాళ్లు చూసే పరిస్థితి లేదు. మిగతా వాటి గురించి ప్రస్తావించే పని కూడా లేదు. ఈ వీకెండ్లో కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’కు ఎదురు లేనట్లే. వీకెండ్లో సినిమా హౌస్ ఫుల్స్‌తో రన్ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. వచ్చే వారం ‘తండేల్’ వచ్చే వరకు వెంకీ సినిమాకు ఎదురు లేనట్లే.
This post was last modified on January 29, 2025 3:04 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…