ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ అయిన మీడియం బడ్జెట్ సినిమాగా కాంతార స్థానం చాలా ప్రత్యేకం. అప్పటిదాకా బయటి రాష్ట్రాల ప్రేక్షకులకు పరిచయమే లేని రిషబ్ శెట్టి ఒక్కసారిగా పాపులరయిపోయాడు. కేవలం పదహారు కోట్లతో తీస్తే నాలుగు వందల కోట్లకు పైగా వసూలు చేయడం ఒక చరిత్ర.
పెట్టుబడులు రాబడి సూత్రం ప్రకారం చూసుకుంటే కెజిఎఫ్ కన్నా కాంతారనే హోంబాలే ఫిలిమ్స్ కి కనకవర్షం కురిపించింది. అందుకే కాంతారాకు ముందు ఏం జరిగిందనే పాయింట్ మీద తీస్తున్న చాప్టర్ 1 మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టే బడ్జెట్ పెంచుతున్నారు.
కంటెంట్ పరంగా చాలా బలమైన అంశాలు ఇందులో పొందుపరుస్తున్నట్టు తెలిసింది. వాటిలో ఒకటి కలరిపయట్టు యుద్ధం. దీన్నే కలరి అని కూడా అంటారు. కేరళలో ఈ విద్యకు 3000 సంవత్సరాల చరిత్ర ఉంది. మన దేశానికి సంబంధించి అతి పురాతన యుద్ధ కళలో కలరిని ప్రధానమైందిగా చెబుతారు.
దీనికి వాడే ఆయుధాలు ప్రత్యేకంగా తయారు చేస్తారు. కఠినమైన శిక్షణ ఉంటుంది. మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి స్టార్లు ఈ బ్యాక్ డ్రాప్ లో చేసిన కొన్ని చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. కాకపోతే తమిళ తెలుగు ఆడియన్స్ కి దీని మీద అవగాహన తక్కువ. కాంతారలో చూసి షాక్ కావడం ఖాయమని ఇన్ సైడ్ టాక్.
కాంతారా 1లో నటిస్తున్న ప్రధాన తారాగణం కలరి విద్యతో పాటు గుర్రాల స్వారీ, కత్తిసాము లాంటి వాటిలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. రిషబ్ శెట్టి స్వంత ఊరైన కుందాపురలో ప్రత్యేకంగా సెట్లు వేసి షూటింగ్ చేస్తున్నారు. పర్యావరణాన్ని దెబ్బ తీస్తున్నారని పలు వివాదాలు తలెత్తినప్పటికి కాంతార 1 నిర్విరామంగా షూట్ జరుపుకుంటోంది.
ప్రస్తుతానికి అధికారంగా లాక్ చేసుకున్న విడుదల తేదీ ఈ ఏడాది అక్టోబర్ 2. ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ మిస్ కాకుండా ఉండేందుకు రిషబ్ శెట్టి పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు. ఏదైనా అనుకోని అవాంతరం వస్తే తప్ప చెప్పిన టైంకే వస్తుంది. ఈసారి బడ్జెట్ మూడు వందల కోట్ల పైమాటేనట.
This post was last modified on January 29, 2025 11:52 am
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…