ఓటిటి ప్లాట్‍ఫామ్ ద్వారా విడుదలయ్యే సినిమాకి టాక్ బ్యాడ్‍గా వచ్చినా కానీ సబ్‍స్క్రయిబర్లు ఏదో ఒక సమయంలో సినిమా చూసేస్తారు. నిశ్శబ్దం విషయంలో అదే రుజువయింది. ఈ చిత్రానికి చాలా బ్యాడ్ టాక్ వచ్చినప్పటికీ స్ట్రీమింగ్ అవర్స్ పరంగా రికార్డు సృష్టించింది. అనుష్క కథానాయిక కావడం ఈ చిత్రానికి పెద్ద ప్లస్ అయింది. బాహుబలి వల్ల అనుష్కకి దేశవ్యాప్తంగా గుర్తింపు వుంది. దీంతో ఈ చిత్రానికి నాన్ తెలుగు స్టేట్స్ నుంచి కూడా వ్యూస్ భారీ స్థాయిలో వచ్చాయి.
మాధవన్ కూడా తమిళనాడుతో పాటు హిందీ మార్కెట్లలో బాగా తెలిసిన నటుడు కావడం ఈ చిత్రానికి మరింత హెల్ప్ అయింది. థియేటర్లలో విడుదలై వుంటే ఈ చిత్రానికి వసూళ్లు రావడం చాలా కష్టమయ్యేది. కానీ ఓటిటి రిలీజ్ వల్ల ఈ చిత్రం రీచ్ బాగా పెరిగింది. ఈ చిత్రంపై భారీ పెట్టుబడి పెట్టిన అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్లకి టాక్ చూసి గుబులు పుట్టినా కానీ లాంగ్ రన్‍లో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది కనుక ఇప్పుడు బెంగ ఏమీ లేదట.
కాకపోతే ఈ సినిమా వల్ల తమకు మరిన్ని సబ్‍స్క్రిప్షన్లు వస్తాయని భావిస్తే ఆ విధంగా ఈ చిత్రం ప్లస్ కాలేకపోయింది. నాని ‘వి’ సినిమాకి కూడా తెలుగు రాష్ట్రాల నుంచి వ్యూస్ వచ్చినా కానీ యూజర్ డేటాబేస్ పెంచడంలో ఆ చిత్రం ఏమంత దోహద పడలేకపోయింది.
This post was last modified on October 18, 2020 1:49 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…